EBM News Telugu

ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..

0

కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయాయి. వలసొచ్చిన చోట బతుకుదెరువు కరువవడంతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సెక్స్ వర్కర్స్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పని లేకుండా పోవడంతో నగరాల్లో బతకలేక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 60శాతం మంది సెక్స్ వర్కర్స్ ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లిపోయారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 5వేల మంది రిజిస్టర్డ్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో 60శాతం అంటే,3వేల మంది ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లిపోయారు.’ అని ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్(AINSW) అధ్యక్షుడు కుసుం వెల్లడించారు. తిండి,మందులు,కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితులే వారి స్వస్థలాకు వెళ్లడానికి కారణమన్నారు.

26 ఏళ్ల రవళి(పేరు మార్చాం) అనే ఓ సెక్స్ వర్కర్ మాట్లాడుతూ.. ’18 ఏళ్ల వయసులో నేను ఉత్తరప్రదేశ్‌లోని మా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. నిజానికి నేనో నటిని కావాలనుకున్నాను. కానీ బతకడం కోసం విధిలేని పరిస్థితుల్లో ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. అప్పటినుంచి కనీసం తిండికి ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను. కానీ కరోనా లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపించింది. కస్టమర్స్ లేకుండా పోయారు. ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోయింది’ అని చెప్పుకొచ్చింది.

Leave A Reply

Your email address will not be published.