EBM News Telugu

ఆన్‌లైన్‌లో అనుష్క సినిమా.. అమెజాన్‌లోనే అంటూ సంచలన నిర్ణయం

0

లాక్‌డౌన్ సమయంలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నారనే వార్తలు రెండు వారాలుగా నెట్లో స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం టాలీవుడ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే.. భాగమతి తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలో రూపొందించారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని భావించారు. అయితే కరోనావైరస్ కారణంగా థియేటర్లలో మూసి వేయడం, ప్రదర్శనలు నిలిపివేయడంతో నిర్మాతలకు షాక్ తగిలింది.

తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో నెలలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల రిలీజ్ ఉండబోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడంతో తెలుగు సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై రిలీజ్ చేయాలనే ఆలోచనలతో ముందుకు పోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.