EBM News Telugu

కరోనా ఎఫెక్ట్… సంచలన నిర్ణయం తీసుకున్న గూగుల్, ఫేస్‌బుక్…

0

ప్రపంచంలోని ఐటీ దిగ్గజ కంపెనీల్లో గూగుల్, ఫేస్‌బుక్‌కి ఉన్న క్రేజే వేరు. ఈ రెండు కంపెనీలు… కరోనా వైరస్ ఎంటరవ్వగానే… ఎక్కువ మంది ఉద్యోగులను వర్క్‌ఫ్రమ్ హోమ్ చెయ్యమని చెప్పాయి. దాంతో ఉద్యోగులు కూడా అధి ఫాలో అయ్యారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా కంపెనీలు… తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్ధమవుతుంటే… గూగుల్, ఫేస్‌బుక్ మాత్రం… అప్పుడే రావద్దని చెప్పాయి. ఈ సంవత్సరం మొత్తం ఇంటి దగ్గర నుంచే పని చెయ్యమని సూచించాయి. ఉద్యోగుల భద్రతే తమకు ముఖ్యమన్న ఈ కంపెనీలు… ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ వీలవుతుంది కాబట్టి… దాన్ని కొనసాగించమని చెప్పేశాయి.

సిలికాన్ వ్యాలీలో శుక్రవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్… కంపెనీ కీలక ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు. రెండో మాట లేకుండా… 2021 వచ్చే వరకూ వర్క్ ఫ్రమ్ హోమే అన్నారు. అందరూ “ఓకే సార్” అన్నారు. అంతే… మీటింగ్ ఈజ్ ఓవర్.

గూగుల్ ఉద్యోగులు ఎవరైనా ఆఫీసులకు వెళ్లే పనిచేస్తామనే నిర్ణయం తీసుకుంటే… దానికి కూడా కంపెనీ అడ్డు చెప్పలేదు. కానీ… అలా ఎవరైనా వస్తారని అనుకోవట్లేదని మేనేజ్‌మెంట్ తెలిపింది. గూగుల్ ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌కి రావాలంటే… జూన్ లేదా జులై నుంచి అనుమతించే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించి యాజమాన్యం మరిన్ని అదనపు ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.