EBM News Telugu

కరోనా షాకింగ్: తీరుమార్చుకున్న వైరస్.. వూహాన్‌లో మళ్లీ బీభత్సం.. బిడెన్-చైనా బంధంపై ట్రంప్ ఫైర్

0

అడ్డూఅదుపు లేకుండా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 51లక్షల మందిని కాటేసింది. 3.3లక్షల మందిని బలితీసుకుంది. క్లినికల్ ట్రయల్ ఒక్కొక్కటిగా ఫెయిలవుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేదు. ఓవైపు వైరస్ విజృంభణ కొనసాగుతున్నా.. ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ఎత్తేసి రీఓపెన్ అయ్యాయి. కార్యకలాపాలు మళ్లీ మొదలైన క్రమంలో కరోనా మరింతగా విస్తరిస్తుందనే భయాలకుతోడు వైరస్ తన లక్షణాలను మార్చుకుంటున్న తీరు కలకలం రేపుతున్నది.

ఆరు నెలల కిందట వూహాన్ లో పుట్టిన తొలి వైరస్‌లు.. ఇప్పుడు వెలుగుచూస్తోన్న వైరస్‌ల లక్షణాల్లో చాలా తేడాలున్నాయని, ఈ మార్పులతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని సైంటిస్టులు అంటున్నారు. మొదట్లో వైరస్ బాధితుల్ని ఈజీగా కనిపెట్టగలిగిన స్థితి నుంచి ఇవాళ 80 శాతానికిపైగా అసింప్టమాటిక్ కేసులే నమోదయ్య దశ వచ్చిందని, ట్రీట్మెంట్ కు వైరస్ స్పందిస్తున్న తీరులోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశోధకులు. దీన్ని వైద్యపరిభాషలో కరోనా సెకండ్ వేవ్ గా పిలుస్తున్నారు.

కరోనా విస్తరించిన తొలి మూడు నెలల్లో.. బాధితుల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించేవి. కరోనా సోకిన తర్వాత ఇక్యూబేషన్ పిరియడ్ లోపలే రోగికి దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, వికారం.. సీరియస్ కేసుల్లోనైతే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు బయటపడేవి. కానీ గడిచిన నెలన్నర రోజులుగా వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో 85 శాతం అసింప్టమాటిక్ కేసులే ఉండటం గమనార్హం. అంటే, ఒక వ్యక్తికి కరోనా సోకితే రమారమి 5.1రోజుల్లో లక్షణాలు కనిపించాలి, కానీ తాజాగా బయటపడుతోన్న కేసుల్లో గరిష్టంగా రెండు వారాల దాకా రోగిలో లక్షణాలు కనిపించడంలేదు. అంతేకాదు, ఆలస్యంగా లక్షణాలు బయటపడుతోన్న కేసుల్లో వైరస్ తగ్గుదల కూడా అంతే ఆలస్యంగా జరుగుతోంది. అంటే, గతంలో కరోనా సోకిన వ్యక్తికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే 14 రోజుల్లో దాన్నుంచి బయపడేవాడు. ఇప్పుడు మాత్రం మహమ్మారి నుంచి కోలుకోడానికి 28 రోజులదాకా పడుతోంది.

కరోనా గండం నుంచి గట్టెక్కామంటూ గర్వంగా ప్రకటించుకుని, లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన చైనా మళ్లీ బొక్కబోర్లా పడింది. ఆ దేశ ఉత్తర సరిహద్దులోని జులిన్, హెయిలాంగ్ జియాన్ రాష్ట్రాల్లో ఈ నెల మొదటి వారం నుంచి వైరస్ మళ్లీ వ్యాపించడంతో రెండోసారి లాక్ డౌన్ విధించారు. రష్యా నుంచి ప్రయాణించినవాళ్లతోనే ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు పెరిగాయని చైనా సర్కారు ప్రకటించింది. కానీ అనూహ్యరీతిలో సెంట్రల్ చైనాలో హుబే ఫ్రావిన్స్ లోనూ కొత్త కేసులు భారీగా వస్తుండటం కలకలం రేపింది. తొలుత వైరస్ పుట్టిన వూహాన్ కూడా ఇదే ఫ్రావిన్స్ లో ఉంది. గడిచిన 24 గంటల్లో ఒక్క వూహాన్ సిటీలోనే కొత్తగా 33 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 31 అసింప్టమాటిక్ కేసులే కావడం, వాళ్లెవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. చైనాలో ఇప్పటిదాకా 82,967 కేసులు నమోదుకాగా, అందులో 78,249మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 4634 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 84గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.