EBM News Telugu

నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది: గుర్తు చేసుకుని సిగ్గు పడిన శ్రీముఖి

0

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ మార్కు చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో మేల్ యాంకర్ల కంటే ఫీమేల్ యాంకర్ల హవానే ఎక్కువ. అందులోనూ కొందరు మాత్రమే తమదైన శైలితో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి పేరును ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. సినిమాలతో కెరీర్‌ను ఆరంభించిన ఆమె… టీవీ రంగంలోకి ప్రవేశించింది. ఇలా అడుగెట్టిందో లేదో తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి జీవితంలో జరిగిన ఊహించని సంఘటన బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

శ్రీముఖి మొదట సినిమాలతోనే కెరీర్‌ను ప్రారంభించింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’ ఆమె మొదటి చిత్రం. దాని తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో నటించింది. ఆ వెంటనే ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. దీంతో బ్రేక్ రానప్పటికీ వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మన్’ వంటి చిత్రాల్లో నటించింది.

సినిమాల్లో భారీ బ్రేక్ రాకపోయినప్పటికీ… టీవీ రంగంలో మాత్రం ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ‘పటాస్’ అనే షో వల్ల ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చింది. అదే సమయంలో చాలా షోల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో భాగంగానే ‘మనీ మనీ’, ‘సూపర్ సింగర్ 9′, ‘జూలకటక’, ‘సూపర్ మామ్’, ‘సరిగమప’ సహా ఎన్నో షోలు చేసింది.

Leave A Reply

Your email address will not be published.