EBM News Telugu

ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి హత్య… మద్యంలో విషం కలిపి..

0

వాళ్లిద్దరూ స్నేహితులు. అయితే వారి స్నేహం మధ్య ప్రేమ చిచ్చు పెట్టింది. అదే చివరకు ఒకరి హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే మచిలీపట్నంలో ఈ నెల 12న జరిగిన సాయి అనే యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు… అతడిని తన స్నేహితుడు యాసిన్ హత్య చేసినట్టు గుర్తించారు. ఏడాదికాలంగా తన చెల్లెలితో ప్రేమాయణం సాగిస్తున్న యాసిన్‌తో కొన్నాళ్ల క్రితం సాయి గొడవపడ్డాడు. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే పగతో సాయిని చంపాలని ప్లాన్ చేశాడు యాసిన్. తన స్నేహితుడు అల్లాభక్షుతో కలిసి ఇందుకు కుట్ర చేశాడు. సాయికి పార్టీ ఇస్తానని చెప్పి ఈ నెల 12న మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల వెనుకకు తీసుకెళ్లాడు.

ముగ్గురు కలిసి మద్యం తాగారు. అయితే విషం కలిపిన మద్యాన్ని సాయి తాగేలా చేశాడు యాసిన్. సాయి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో యాసిన్ అతడి స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిని కొందరు ఆస్పత్రికి తరలించగా… అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. కేసు విచారణ చేపట్టి యాసిన్, అల్లాభక్షులను నిందితులుగా గుర్తించిన పోలీసులు… వారిని కోర్టులో హాజరుపరిచారు.

Leave A Reply

Your email address will not be published.