EBM News Telugu

ఫేక్ ఐడీల గోలేంటి.. ‘క్రాక్’ చుట్టూ ఈ రచ్చ ఏంటి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

0

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఏది నిజమే ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నాం. ఇక వ్యక్తుల ఖాతాలకు సంబంధించి కొన్ని గుర్తులున్నాయి. కానీ అవి లేని వారి పరిస్థితి మరీదారుణంగా ఉంటుంది. వారు ట్వీట్స్ చేయకపోయినా, ఎలాంటి పోస్ట్‌లు చేయకపోయినా అవి ఫేక్ అని ఎవ్వరూ గుర్తించరు. స్వయంగా సదరు అధికారిక వ్యక్తి రంగంలోకి దిగి.. ఇది తమ ఖాతా కాదని ఖండిస్తే తప్పా ఎవ్వరికీ తెలియదు. తాజాగా క్రాక్ సినిమా చుట్టూ, క్రాక్ ఫస్ట్ సింగిల్ అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసినట్టుగా కొందరు ఆకతాయిలు పోస్ట్ చేశారు. అయితే అదంతా అవాస్తమని వారిద్దరు ఖండించారు. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం

మాస్ మహారాజ రవితేజకు డాన్ శీను, బలుపు వంటి హిట్స్ అందించాడు గోపిచంద్ మలినేని. గత కొన్నేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న రవితేజను.. ఎలాగైనా క్రాక్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా చేసేందుకు గోపిచంద్ మలినేని ప్రయత్నిస్తున్నాడు

క్రాక్ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అంతా సవ్యంగా ఉండుంటే ఈపాటికే థియేటర్‌లో క్రాక్ సందడి చేసేది.

Leave A Reply

Your email address will not be published.