EBM News Telugu

మాస్క్ ఏదని అడినందుకు.. పోలీసులను చితకబాదిన గ్యాంగ్

0

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్‌ను ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. ఐతే ఇప్పటికీ కొందరు మాస్క్ ధరించకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారిని పోలీసులు ప్రశ్నించినప్పుడు.. ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మాస్క్ ఏదని ప్రశ్నించినందుకు.. పోలీసులపై కొందరు దండగులు దాడిచేశారు. పదునైన ఆయుధాలతో చితకబాదారు.

గురువారం అంటాప్ హిల్ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించే వారిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మాస్క్ లేకుండా కనిపించారు. మాస్క్ తప్పనిసరి కదా.. మరి ఎందుకు ధరించలేదని నిలదీశారు. దాంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. అనంతరం కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.