EBM News Telugu

రాష్ట్రాలకు రుణపరిమితి భారీగా పెంపు, ఉపయోగించుకుంది 14 శాతమే: నిర్మల

0

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాలు కోల్పోయినట్లు చెప్పారు. ‘కరోనా వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలు రెవెన్యూ కోల్పోయాయి’ అని ఆర్థికమంత్రి అన్నారు. రాష్ట్రాలను ఆదుకునేందుకు నిరంతరం అదనపు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా కారణంగా ఆదాయం కోల్పోయినందున రాష్ట్రాలను ఆదుకుంటామని, నిరంతరం అదనపు నిధులను విడుదల చేస్తామని నిర్మల చెప్పారు. రాష్ట్రాలు ఇబ్బందులు పడకుండా పన్నుల్లో వాటాను ఎప్పటికప్పుడు కేంద్రం విడుదల చేస్తూనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధుల కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఏప్రిల్ నుండి రూ.46,038 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశామన్నారు.

రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు విడుదల చేశామని నిర్మల చెప్పారు. విపత్తు నిర్వహణ కోసం ఏప్రిల్ నెల నుండి రూ.46,038 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రూ.11,092 కోట్లు విడుదల చేశామని, నిధుల కొరత కారణంగా రాష్ట్రాలకు ఆర్బీఐ ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపారు. కేంద్ర విజ్ఞప్తిని మన్నించి ఆర్బీఐ రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 32 రోజుల నుండి 50 రోజులకు పెంచిందని చెప్పారు. రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ పరిమితిని ఆర్బీఐ 60 శాతం పెంచిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.