EBM News Telugu

సత్యం వధ ధర్మం చర.. ప్రస్తుతం అర్థం మారిపోయిందంటా.. నాగబాబు సెటైర్స్

0

మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు ఎంతగా సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల సెగ మెగా కుటుంబానికి, జనసేన పార్టీకి తగిలాయి. రాజకీయ నాయకులు నాగబాబును మాత్రమే కాకుండా మెగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు. కొంతమంది నాగబాబుపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. నాగబాబు మాత్రం వెనకడగు వేయడం లేదు. తాజాగా మరో ట్వీట్ చేశాడు.

నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)’ అని చెప్పారు.

‘గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’అని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్‌లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమ’ని చెప్పుకొచ్చాడు. మరో ట్వీట్ చేస్తూ.. ‘నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేద’ని చెప్పుకొచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.