EBM News Telugu

1973 నుండి రాబడి అంతే.. ధరలు ఇలాగే..: బంగారంపై ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

0

2000 డాట్‌కామ్ సంక్షోభం, 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఇప్పుడు కరోనా వైరస్ సమయంలోను అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ఆనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రభావం తగ్గి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కుదురుకున్న తర్వాత బంగారం ర్యాలీ అదే విధంగా కొనసాగుతుందా అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 16 శాతం పెరిగాయి.

కరోనా కారణంగా మార్కెట్లు నష్టాలను చూస్తున్నాయి. అప్పుడప్పుడు కాస్త కోలుకున్నప్పటికీ తిరిగి కుప్పకూలుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదు. పైగా నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్స్, బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇండియాలో కుటుంబాలు బంగారంపై పెట్టుబడి పెట్టడం సహజమే. ఇప్పుడు ఇన్వెస్టర్లు మరింతగా బంగారం వైపు చూస్తున్నారు.

గత మూడు నాలుగు నెలలుగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ.43,000 నుండి రూ.47,000 మధ్య కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలోనే 40 శాతం వరకు పెరిగాయి. ఈ క్యాలెండర్ ఇయర్‌లో 16 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా పెరిగిన ధరలకు తోడు, ఎక్కువ ధర ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తవచ్చు. అటు ఇక్విటీ మార్కెట్ నష్టాల్లో ఉండటం, బంగారం పెరుగుతున్న పరిస్థితుల్లో.. పెట్టుబడులు సరైన మార్గం ఏది అనే ప్రశ్న ఉదయించడం సహజం.

మీరు దీర్ఘకాలానికి గాను పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రస్తుత ధరల (కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ) సమయంలో మీ నిర్ణయం సరైనదిగానే భావించవచ్చు. ధరలు కాస్త పెరిగినా, తగ్గినా కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రతిద్రవ్యోల్భణం సమయంలో బంగారం బాగా ర్యాలీ అవుతుందని ఆక్స్‌ఫర్ట్ ఎకనమిక్ సర్వేలో తేలింది. ప్రతిద్రవ్యోల్భణం అంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, వినియోగం తగ్గడం, ఆర్థిక వ్యవస్థలలో ఒత్తిళ్లు వంటివి.

Leave A Reply

Your email address will not be published.