Leading News Portal in Telugu

Azadi Ka Amrit Mahotsav: మొక్కలు నాటిన కళాశాల విద్యార్థులు.. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత చాటేలా.. – Telugu News | Azadi Ka Amrit Mahotsav: College Students from Vizag takes part in My India My Life Goals Campaign


Azadi Ka Amrit Mahotsav: కేంద్రప్రభుత్వ సారథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుంచి మై ఇండియా.. మై లైఫ్‌.. మై గోల్స్‌ పేరుతో విస్తృత ప్రచారం చేపడుతున్నారు.  ఆజాదీగా అమృతోత్సవ్‌లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ థీమ్‌తో మై లైఫ్ – మై ఇండియా గోల్స్ పేరుతో జరుగుతున్న కాంపైనింగ్ నిర్వహిస్తున్న టీవీ9 ..విశాఖలోని ప్రతిష్టాత్మక ఏవిఎన్ కళాశాలలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థుల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమం లో అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటేలా ఈ కార్యక్రమం కొనసాగింది.

కేంద్రప్రభుత్వ సారథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుంచి మై ఇండియా.. మై లైఫ్‌.. మై గోల్స్‌ పేరుతో విస్తృత ప్రచారం చేపడుతున్నారు.  ఆజాదీగా అమృతోత్సవ్‌లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మై ఇండియా.. మై లైఫ్‌.. మై గోల్స్ కార్యక్రమం ప్రారంభంకాగా.. కేంద్రప్రభుత్వంతో క్యాంపెయిన్‌లో  టీవీ9 నెట్‌వర్క్‌ భాగస్వామిగా ఉంది.