Andhra Pradesh: కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్.. అంతా భార్యనే..! ఇరవై నిమిషాల్లో భర్తను ఎలా చంపిందో తెలుసా..? – Telugu News | Wife kills Constable husband with help of lover in Visakhapatnam, full case details revealed by Police
Constable Murder Case: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ ఎపిసోడ్ అతని ఇంట్లో.. 20 నిమిషాల పాటు నడిచింది. రమేష్ వచ్చి మద్యం సేవిస్తున్న సమయంలో ప్రియుడికి కాల్ చేసింది భార్య శివాని. ఈరోజు స్పాట్ చేసేందుకు రెడీ అయిపోవాలని సూచించింది. ప్రియురాలు శివాని సూచనతో తనకు సన్నిహితుడైన నీలాతో కలిసి శివాని ఇంటి వరకు వచ్చాడు ప్రియుడు. రమేష్ మద్యంతోపాటు టాబ్లెట్ల మత్తు లోకి జారుకున్న తర్వాత. ఆ ఇద్దరినీ రమ్మని పిలిచింది శివాని. దీంతో నీలా ను లోపలికి పంపాడు ప్రియుడు రామారావు. పని ప్రారంభించారు.
విశాఖపట్నం, ఆగస్టు 07: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్..! ఆమె.. పేరు మోసిన సినీ డైరెక్టర్లనే ఆ వివాహిత మించిపోయింది. ఓవైపు ప్రియుడితో సరసాలు కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమ కురిపించేలా భర్తతో నటించింది. ఆమె విషయం తెలిసినప్పటికీ.. నాకోసం మారింది లే అనుకున్నా.. ఆమె క్రిమినల్ మైండ్ సెట్ మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు ఆ కానిస్టేబుల్ భర్త.. తాను చనిపోయినా.. తెలివైన భార్య తనకు దొరికినందుకు తన జీవితానికి డోకా లేదులే అని భావించాడు. కానీ ఇంతలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రియుడు మత్తు టాబ్లెట్లు అందిస్తే.. 20 నిమిషాల్లో కేల్ ఖతం చేసేసింది ఆ కిలాడి క్రిమినల్ లేడీ. విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కిల్లర్ భార్య కండింగ్ మెంటాలిటీ బయటపడుతుంది. మద్యంలో మత్తు టాబ్లెట్లు వేసి అనుమానం రాకుండా మటన్ తలకాయ వండిపెట్టింది భార్య. ఆపై అన్యోన్యంగా ఉంటున్నట్టు వీడియోలు చిత్రీకరించింది.
10 నిమిషాల పాటు కానిస్టేబుల్ పైకెక్కికూర్చుని..
కానిస్టేబుల్ రమేష్ మర్డర్ ఎపిసోడ్ అతని ఇంట్లో.. 20 నిమిషాల పాటు నడిచింది. రమేష్ వచ్చి మద్యం సేవిస్తున్న సమయంలో ప్రియుడికి కాల్ చేసింది భార్య శివాని. ఈరోజు స్పాట్ చేసేందుకు రెడీ అయిపోవాలని సూచించింది. ప్రియురాలు శివాని సూచనతో తనకు సన్నిహితుడైన నీలాతో కలిసి శివాని ఇంటి వరకు వచ్చాడు ప్రియుడు. రమేష్ మద్యంతోపాటు టాబ్లెట్ల మత్తు లోకి జారుకున్న తర్వాత. ఆ ఇద్దరినీ రమ్మని పిలిచింది శివాని. దీంతో నీలా ను లోపలికి పంపాడు ప్రియుడు రామారావు. పని ప్రారంభించారు. కానిస్టేబుల్ ఛాతిపై కూర్చొని ముఖంపై తలగడ నొక్కి పెట్టాడు నీలా అనే ప్రియుడి స్నేహితుడు. 10 నిమిషాల పాటు కానిస్టేబుల్ పైనే కూర్చున్నడు నిందితుడు నీలా. అదే సమయంలో.. కనీసం కనికరం లేకుండా కదలకుండా కాళ్లు పట్టుకుంది భార్య శివాని. పాపం అప్పటికే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆ రమేష్.. తనకు తాను రక్షించుకునే నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. శివాని నీలా లోపల రమేష్ ను హత్య చేస్తుంటే.. ప్రియుడు రామారావు ఇంటి బయట ఉండిపోయాడు. కాపలా కాస్తున్నాడు.
ఆ టాబ్లెట్లు.. అలా..
భర్తను చంపేందుకు మత్తు టాబ్లెట్లు తీసుకురావాలని ప్రియురాలు శివాని ఆర్డర్ చేయడంతో.. ప్రియుడు రామారావు కూడా ప్రత్యేకంగా స్కెచ్ వేశాడు. తన స్నేహితుడు తల్లి ట్రీట్మెంట్ కోసం మత్తు టాబ్లెట్లు వినియోగించేది. స్నేహితుడు ఎక్కడో దూరంగా ఉండడంతో.. ఆ ప్రెస్క్రిప్షన్ను రామారావుకు పంపి మందులను అందించాల్సిందిగా కోరేవాడు. దీంతో తరచూ ఆ మత్తు టాబ్లెట్లను రామారావు కొనుగోలు చేసి స్నేహితుడు తల్లికి అందించేవాడు. అయితే.. ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు వినియోగించే టాబ్లెట్ల కోసం రామారావుకు పని ఈజీ అయింది. అదే ప్రెస్క్రిప్షన్ తో మత్తు టాబ్లెట్లను కొన్ని తీసుకువచ్చి ప్రియురాలు శివాని చేతిలో పెట్టేసాడు. ఇక.. అప్పటికే నటనలో ఆరితేరిపోయిన శివాని.. భర్తకు కనీసమైన అనుమానం రాకుండా మధ్యలో ఆ టాబ్లెట్లను కలిపేసింది.
లక్ష రూపాయల ఆఫర్.. కానీ..!
కానిస్టేబుల్ ను హత్య చేసేందుకు నీలాకు లక్ష రూపాయలు ఆఫర్ చేశాడు శివాని ప్రియుడు రామారావు. అప్పటికే అతని మోజులో బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ప్రియుడికి అందించింది శివాని. అప్పటికే నీలాకు డబ్బులు అవసరం ఇవ్వడంతో హత్య చేసేందుకు రెడీ అయిపోయాడు. కానీ ఆ లక్ష రూపాయలో చేతికి ముట్టలేదు.
చాలా రోజుల నుంచే ప్లాన్..
భార్య శివాని నటన గుర్తించలేక.. మై వైఫ్.. మై లైఫ్ అంటూ మద్యం సేవించాడు కానిస్టేబుల్. ఇదే అదనుగా చేసుకుని అన్యోన్యంగా ఉంటూ వీడియోలు తీసింది భార్య శివాని. ఉదయం లేచి డ్రామా మొదలుపెట్టి అనుమానం రాకుండా కుటుంబ సభ్యులకు వీడియోలు కూడా షేర్ చేసింది. భర్త అయినా కానిస్టేబుల్ రమేష్ ను ఎప్పటినుంచో చంపాలనుకుంది భార్య శివాని. అదన కోసం వేచి చూసింది. మందు కోసం మటన్ వండి పెట్టమని కానిస్టేబుల్ చెబితే.. ప్రియుడికి కాల్ చేసి మడర్ స్కెచ్ వేసింది. ప్రియుడు ఇచ్చిన మత్తు టాబ్లెట్లను కానిస్టేబుల్ కు తెలియకుండా మద్యంలో కలిపింది శివాని. ఊపిరి పోయిన తర్వాత.. తెల్లవారి నుంచి డ్రామా మొదలుపెట్టింది. అంతకుముందు అన్యోన్యంగా వీడియోలు తీయడంతో అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు ఈ కండింగ్ వైఫ్ క్రిమినల్ మెంటాలిటీ వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ కు వచ్చే బెనిఫిట్స్ కొట్టేసి ప్రియుడితో సెటిల్ అయిపోవాలని శివాని ప్లాన్ చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తాకట్టు పెట్టిన బంగారం కోసం, ప్రియుడి వ్యవహారం తెలిసి కానిస్టేబుల్ భార్యను ప్రశ్నించేవాడు కానిస్టేబుల్ రమేష్. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని శివాని ప్లాన్ చేసి ప్రియుడికి చెప్పి కానిస్టేబుల్ హత్య చేశారు.
హత్య చేశాక ఆ కాల్..
నీలాతో కలిసి భర్త రమేష్ ను హత్య చేసిన భార్య శివాని.. ఆ వెంటనే ఊపిరి పోయిందని నిర్ధారించుకుంది. హమ్మయ్య అనుకొని.. ఇక తన డ్రామాకు అవసరమైన పనులను చెక్కబెట్టుకుంది. భర్త ప్రాణం తీసిన తర్వాత.. ఓ వాట్సప్ కాల్ కూడా ప్రియుడికి చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించామని అంటున్నారు ద్వారకా ఏసిపి మూర్తి. ఇది కానిస్టేబుల్ భార్య క్రిమినల్ మెంటాలిటీపై పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కఠోర వాస్తవాలు. ప్రియుడు మోజులో పడి భర్తను మట్టు పెట్టేందుకు శివాని వ్యవహరించిన తీరు.. ఘటన గురించి తెలుసుకున్న వారందరినీ కలచివేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..