Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్ – Telugu News | GHMC interactive science park in HITEC City video
చుట్టూ పచ్చని చెట్లు.. స్వచ్చమైన గాలి.. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో హాయిగా కూర్చోని మీ ఆఫీస్ వర్క్ చేసుకోవాలనిపిస్తుందా..? మహానగరంలో అధిక జనసంచారం, నిత్యం వాహనాల రణధ్వనుల మధ్య పని చేసుకోవడానికి ప్రశాంతతే కరువైంది. పార్క్‌లో కూర్చోని ప్రశాంతమైన వాతావరణంలో పని చేయాలనుకునేవారికి జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్ తెలిపింది.
చుట్టూ పచ్చని చెట్లు.. స్వచ్చమైన గాలి.. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో హాయిగా కూర్చోని మీ ఆఫీస్ వర్క్ చేసుకోవాలనిపిస్తుందా..? మహానగరంలో అధిక జనసంచారం, నిత్యం వాహనాల రణధ్వనుల మధ్య పని చేసుకోవడానికి ప్రశాంతతే కరువైంది. పార్క్‌లో కూర్చోని ప్రశాంతమైన వాతావరణంలో పని చేయాలనుకునేవారికి జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మాములుగా పార్కులంటే ప్రేమికులతో నిండిపోయి ఉంటాయి. ఇక పిల్లలతో సరదాగా గడపడానికి కుటుంబసభ్యులు, స్నేహితులందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవానికి పార్కులకు వెళుతుంటారు.ఇలాంటి ప్రదేశాల్లో కూర్చోని ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే వీలు పడని విషయం. కానీ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పచ్చని వాతావరణంలో ఆఫీస్ వర్క్ చేసుకునేలా ఓ వినూత్నమైన ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది. మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ సమీపంలోని ప్రతికానగర్లో ఈ కొత్త తరహా పార్క్‌ను ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..
Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల