Leading News Portal in Telugu

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్ పోరుకు రంగం సిద్ధం.. హై వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే.. – Telugu News | Ind vs pak hockey match in asian champions trophy 2023 check live straming ott details timing and venue


India vs Pakistan Match, Asian Champions Trophy 2023: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు గ్రేట్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరగనుంది. ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య గొప్ప మ్యాచ్ జరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Asian Champions Trophy 2023: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ప్రస్తుతం భారతదేశంలో జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో బుధవారం, ఆగస్టు 9వ తేదీన హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు (IND vs PAK Hockey Match) ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య గొప్ప మ్యాచ్ జరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్..

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు గ్రేట్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అభిమానులు ఈ మ్యాచ్‌ని ఆస్వాదించవచ్చు. అదే సమయంలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్యాన్‌కోడ్‌లో ఉంటుంది. హాకీలో భారత్, పాకిస్థాన్‌లు 178 సార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 82, భారత జట్టు 64 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అదే సమయంలో 32 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ జట్టు..

ముహమ్మద్ ఉమర్ భట్టా (కెప్టెన్), అక్మల్ హుస్సేన్, అబ్దుల్లా ఇష్తియాక్ ఖాన్, ముహమ్మద్ అబ్దుల్లా, ముహమ్మద్ సుఫియాన్ ఖాన్, ఎహత్షామ్ అస్లాం, ఒసామా బషీర్, అకీల్ అహ్మద్, అర్షద్ లియాఖత్, ముహమ్మద్ ఇమాద్, అబ్దుల్ హనన్ షాహిద్, జకారియా హయత్, రానా అబ్దుల్ వహీద్ అష్రఫ్ (వైస్- కెప్టెన్) ), రోమన్, ముహమ్మద్ ముర్తజా యాకూబ్, ముహమ్మద్ షాజెబ్ ఖాన్, అఫ్రాజ్, అబ్దుల్ రెహమాన్.

స్టాండ్‌బై: అలీ రజా, ముహమ్మద్ బాకీర్, ముహమ్మద్ నదీమ్ ఖాన్, అబ్దుల్ వహాబ్, వకార్ అలీ, ముహమ్మద్ అర్సలాన్, అబ్దుల్ ఖయ్యూమ్.

భారత హాకీ జట్టు..

గోల్ కీపర్లు: పీఆర్ శ్రీజేష్, కృష్ణ బహదూర్ పాఠక్

డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, జుగ్రాజ్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్.

మిడ్‌ఫీల్డర్లు: హార్దిక్ సింగ్ (వైస్ కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్మ సింగ్

ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, ఎస్ కార్తీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..