Telangana: ఎన్నికలొస్తున్నాయ్.. ఓటరు జాబితాలో మీ పేరు సరి చేసుకున్నారా..? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి – Telugu News | Election Commision Advices People to change the mistake names on Voting ID
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 18 ఏళ్లు దాటిన వారు ఎన్నికల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఓటింగ్ కార్డు ఉన్నవారిలో కొన్ని తప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలావరకు మార్పులు చేర్పులు చేయల్సి ఉంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత కసరత్తు చేస్తోంది. ఓటరు జబితాలో నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో మునిగి తేలుతోంది. తప్పులు లేని ఓటర్ జాబితా తయారీ లక్ష్యంగా ఓటర్లకు పలు సూచనలు చేస్తోంది. తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోగలరని అధికారులు సూచిస్తున్నారు.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 18 ఏళ్లు దాటిన వారు ఎన్నికల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఓటింగ్ కార్డు ఉన్నవారిలో కొన్ని తప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలావరకు మార్పులు చేర్పులు చేయల్సి ఉంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత కసరత్తు చేస్తోంది. ఓటరు జబితాలో నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో మునిగి తేలుతోంది. తప్పులు లేని ఓటర్ జాబితా తయారీ లక్ష్యంగా ఓటర్లకు పలు సూచనలు చేస్తోంది.తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోగలరని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు
ఓటరు జాబితాలో పేరులో ఉన్న అక్షర దోషాలు, మిస్ మ్యాచ్ ఫోటోలు, జాబితాలో ఫోటోలు, ఇంటి నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ నమోదు, ఓటరుతో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు, రిలేషన్ లాంటి జాబితాలో తప్పుగా నమోదైనా, అంతే కాకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన ఓటర్లు అదే నియోజకవర్గం ఒకే పోలింగ్ స్టేషన్ లోనే కాకుండా అదే నియోజకవర్గంలో గల వేర్వేరు పోలింగ్ స్టేషన్ లో గాని బార్డర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంబంధించిన తప్పులు అన్నింటినీ సరి చేసుకోవడానికి జాబితాలో మార్పులు, చేర్పుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా వెసులుబాటు కల్పించింది.
ఈ నేపథ్యం లో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం అన్నింటికీ ఫారం-8 ద్వారా ఆన్ లైన్ ద్వారా, www.voters.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని నమోదు చేసుకోగలరని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు లేకుండా కేవలం EPIC కలిగి ఉన్న తమ ఓటు హక్కు వినియోగం చేసుకునే అవకాశం లేనందున.. అలాంటి వారు ఫారం-6 ద్వారా పైన తెలిపిన వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వెబ్ సైట్ నమోదు సందర్భంగా అవసరమైన సహాయం కొరకు ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 కి ఫోన్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ కోరారు. కార్యాలయ పని వేళలో ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని తెలిపారు. ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.