Leading News Portal in Telugu

ఆ ఆసుపత్రిలో అందుబాటులో ఉండని డాక్టర్లు.. చికిత్స చేస్తున్న సెక్యూరిటీ గార్డులు – Telugu News | Security Guard administers First Aid to a Person in Bhadvel Governemt Hospital, Kadapa


నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాల్సిన డాక్టర్లు ఆసుపత్రిలోనే లేకుండా తమ పనులకు ప్రాధాన్యత ఇస్తూ బయట తిరుగుతుండడంతో అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులే డాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలో ఉండవలసిన డాక్టర్ తన విభాగంలో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మానవత్వంతో దెబ్బలతో అక్కడికి వచ్చిన వారికి కట్లు కట్టి డాక్టర్ చేయాల్సిన పనిని తాను చేశాడు. ఈ వ్యవహారం కడప జిల్లాలోని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాల్సిన డాక్టర్లు ఆసుపత్రిలోనే లేకుండా తమ పనులకు ప్రాధాన్యత ఇస్తూ బయట తిరుగుతుండడంతో అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులే డాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలో ఉండవలసిన డాక్టర్ తన విభాగంలో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మానవత్వంతో దెబ్బలతో అక్కడికి వచ్చిన వారికి కట్లు కట్టి డాక్టర్ చేయాల్సిన పనిని తాను చేశాడు. ఈ వ్యవహారం కడప జిల్లాలోని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ తన విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి దెబ్బలతో ఆసుపత్రికి వచ్చాడు. కానీ అక్కడ డాక్టర్ లేకపోవడంతో బాధితుని బంధువులు కంగారు పడ్డారు. ఇక చివరికి అక్కడున్న సెక్యూరిటీ గార్డే అతనికి ప్రథమ చికిత్స చేశాడు.

బాధితుని గాయాలను తుడిచి కట్లు కూడా వేశాడు. అయితే అత్యవసర విభాగం వద్ద ఉండవలసిన డాక్టర్ అక్కడ లేకపోవడం వలన సెక్యూరిటీ గార్డ్ ఈ పని చేయవలసి వచ్చిందని స్థానికులు తెలిపారు. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది నిత్య కృత్యంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇలా సెక్యూరిటీ గార్డులు వచ్చి పనిచేయడం ఇక్కడేమీ కొత్త కాదని డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉండరని అంటున్నారు. అయితే ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రమాదాలు జరిగి అత్యవసరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగుల విషయంలో అక్కడ డాక్టర్లు లేక ప్రథమ చికిత్స చేసే వాళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కింద అత్యంత ప్రణాళికాబద్ధంగా మారుస్తుంటే డాక్టర్లు మాత్రం వారి సొంత పనులను చూసుకుంటూ ఆసుపత్రిలో లేకుండా నర్సులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై బాధ్యతలు వదిలేసి వెళ్లిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. డాక్టర్ లేకపోయినా తన వంతుగా వచ్చిన వారికి ప్రథమ చికిత్స చేసిన సెక్యూరిటీ గార్డును అభినందిస్తున్నారు. కనీసం అతనిలో ఉన్న మానవత్వంలో కొంతైనా డాక్టర్లకు ఉంటే రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దౌర్భాగ్యం ఉండేది కాదని బద్వేల్ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆసుపత్రులను అప్పుడప్పుడు అన్న తనిఖీ చేస్తూ ఉంటే డాక్టర్లు కనీసం వారి సీట్లలో కూర్చొని పనులు చేస్తూ ఉంటారని లేదంటే ఇది ఇలాగే కొనసాగితే రోగులు వెదనలు పట్టించుకునే నాధుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి