Leading News Portal in Telugu

Billa Ganneru Leaves Benefits: తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇక నో టెన్షన్.. బిళ్ల గన్నేరుతో బైబై చెప్పండి!! – Telugu News | Stop Hair fall to Use of Billa Ganneru Leaves, here is full details


మనం తింటున్న ఆహారంలో విటమిన్లు, పోషకాల లోపం, వాయు కాలుష్యం, రసాయన జనిత ఆయిల్స్, షాంపూలను తలకు వాడటం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య పెరిగిపోతోంది. స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి.. ఆఫీసులకెళ్లే యువత వరకూ ఇదే సమస్య. పిల్లల్లో వస్తే బాలమెరుపు అంటారు.. కానీ పెళ్లీడు వయసులో జుట్టు మెరిస్తే అప్పుడే ముసలివాళ్లు అయిపోయారంటూ తోటివారు వెక్కిరిస్తుంటారు. మూడు పదులైనా రాకుండానే జుట్టు నెరవడంతో..

మనం తింటున్న ఆహారంలో విటమిన్లు, పోషకాల లోపం, వాయు కాలుష్యం, రసాయన జనిత ఆయిల్స్, షాంపూలను తలకు వాడటం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య పెరిగిపోతోంది. స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి.. ఆఫీసులకెళ్లే యువత వరకూ ఇదే సమస్య. పిల్లల్లో వస్తే బాలమెరుపు అంటారు.. కానీ పెళ్లీడు వయసులో జుట్టు మెరిస్తే అప్పుడే ముసలివాళ్లు అయిపోయారంటూ తోటివారు వెక్కిరిస్తుంటారు. మూడు పదులైనా రాకుండానే జుట్టు నెరవడంతో.. దానిని కనిపించకుండా కవర్ చేసేందుకు తలకు కలర్ వేసేస్తున్నారు. ఇది ఇంకా ప్రమాదకరం. ఇలా చేస్తే ఉన్న తెల్లజుట్టే కాకుండా.. నల్లగా ఉన్న కొద్దిపాటి జుట్టుకూడా తెల్లగా అవుతుంటుంది.

తలలో ఒక్క వెంట్రుక తెల్లగా కనిపించినా కలర్ వేసేస్తే.. మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడటం ఖాయం. కాబట్టి తలకు డై వేయడం వంటి అలవాటును ముందు మానుకోండి. జుట్టుకు రంగులు వేయడానికి బదులుగా హెర్బల్ హెన్నా లేదా.. నేచురల్ గా తయారు చేసిన గోరింటాకును తలకు పెట్టుకోవడం ఆరోగ్యం పరంగా కూడా మంచిది. తలలో వేడిని తగ్గించి.. ప్రశాంతతను ఇస్తుంది.

తెల్లజుట్టుకు బిళ్లగన్నేరు ఆకులతో చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ మొక్కలు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. రెండునెలల పాటు ఈ చిట్కాను పాటిస్తే.. తెల్లజుట్టును పూర్తిగా నల్లగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కా ఏంటో చెప్పలేదు కదా. ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

*ఒక కప్పు బిళ్ల గన్నేరు ఆకులను తీసుకుని.. వాటిని శుభ్రం చేసుకుని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీసి గిన్నెలో వేసుకోవాలి. ఈ రసంలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

*ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో జుట్టు కుదుళ్లకు పట్టించి.. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు.. రెండు నెలలపాటు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గి.. ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా ట్రై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..