Leading News Portal in Telugu

World Lion Day 2023: అంతరించిపోతున్న జంతువుల్లో ఒకటి సింహం.. మన దేశంలో ఈ రిజర్వ్ పార్కుల్లో మృగరాజులు సందర్శించవచ్చు.. – Telugu News | World Lion Day 2023 These are famous lion reserve of India

Surya Kala |

Updated on: Aug 10, 2023 | 11:48 AM

అడవుల్లో నివసించే కౄర జంతువుల్లో సింహం ఒకటి. అంతేకాదు మృగరాజుని అడవికి రాజు అని కూడా పిలుస్తారు. తన గర్జనతోనే ఇతర జంతువులను వణికిస్తుంది. మనుషులను, జంతువులను భయపెట్టే ఈ  మృగరాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అంతేకాదు అంతరించిపోయే జంవుతుల్లో ఒకటి సింహం. ఈ నేపథ్యంలో ఆగష్టు 10 వ తేదీన ప్రపంచ లయన్ డే గా జరుపుకుంటాం. తద్వారా అంతరించిపోతున్న సింహం భద్రత తేలుకుంటారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ రోజు భారతదేశంలోని ప్రసిద్ధ లయన్స్ రిజర్వ్ పార్క్ గురించి తెలుసుకుందాం.. 

Aug 10, 2023 | 11:48 AM

ప్రతి సంవత్సరం ఆగస్టు 10న సింహ దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో సింహాలకు నివాసాలుగా అనేక రిజర్వ్ పార్కులు ఉన్నాయి. ప్రసిద్ధి గాంచిన ఈ రిజర్వ్ పార్కులు ఏమిటంటే,.. 

గిర్ నేషనల్ పార్క్: ఆసియాటిక్ సింహాలు వాటి సహజ ఆవాసాలతో నివసించే భారతదేశంలోని ఏకైక జాతీయ పార్కు ఇది. గిర్‌లో సఫారీ రైడ్‌లో సింహాలను చూడటం విభిన్నమైన సరదా. వెరావల్, జునాగఢ్ రైల్వే స్టేషన్లు ఈ పార్కుకు సమీపంలో ఉన్నాయి. రైలు దిగిన తర్వాత, మీరు క్యాబ్ లేదా బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

కునో నేషనల్ పార్క్: ఇటీవల ప్రధాని మోడీ నైజీరియాకు చెందిన చిరుతలను ఈ పార్క్ లో ప్రవేశ పెట్టడంతో ఈ పార్క్ ప్రజలకు చేరువైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కునో జాతీయ పార్క్ ప్రకృతి అందాలకు నెలవు. అంతేకాదు ఈ ప్రదేశం భారతదేశంలోని ఆసియాటిక్ సింహాలకు రెండవ అతిపెద్ద నివాసంగా పరిగణించబడుతుంది. అడవి రాజులైన సింహాలు ఈ పార్క్ లో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి జీవిస్తున్నాయి. 

చంద్ర ప్రభ వన్యప్రాణుల అభయారణ్యం: వారణాసికి ఆనుకుని ఉన్న ఈ పార్క్ సింహాలకు కూడా ప్రసిద్ధి. వారణాసికి కేవలం 65 కి.మీ దూరంలో ఉన్న ఈ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతేకాదు ఇక్కడ సింహాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీనిని కాశీలో భాగం అని కూడా అంటారు

సీతామాత వన్యప్రాణి అభయారణ్యం: రాజస్థాన్ లో ఉన్న ఈ స్థలాన్ని జనవరి 2, 1979న వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఒకప్పుడు రాజస్థాన్‌లో కనిపించే ఆసియా సింహం, పులి వంటి అనేక జంతువులు ఇక్కడ ఉండేవి. ఇప్పుడు వీటిని గుజరాత్ నుంచి తరలించి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 