Leading News Portal in Telugu

AP Food Festival: రేషన్‌ బియ్యంతో అదిరిపోయే రుచులు..105 రకాల వంటకాలతో అదరగొట్టేశారు – Telugu News | Andhra Pradesh: Cooking competitions with ration rice were held grandly in West Godavari district


ఫుడ్ ఫెస్టివల్ అంటే భోజనప్రియులకు మహసరదా. పలు హోటల్స్ నిర్వాహకులు వెజ్, నాన్ వెజ్ వంటలతో వివిధ రకాలుగా పదార్ధాలు తయారు చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇపుడు పశ్చిమ గోదావరి జిల్లాలో రేషన్ బియ్యం తో ఆహారపదార్ధాలు తయారీ పోటీలు జరిగాయి. రేషన్ బియ్యం అంటే పేదలకు ఉచితంగా అందించేవి. వీటి క్వాలిటీ సరిగా ఉండదని చాలా మంది అమ్మేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఎపి ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు..

West Godavari Food Festival

ఏలూరు, ఆగస్టు 10: రేషన్ బియ్యమా అని పెదవి విరుస్తున్నారా.. అయితే నోరూ రించే ఈ రుచులు టేస్ట్ చేస్తే మీ అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఫుడ్ ఫెస్టివల్ అంటే భోజనప్రియులకు మహసరదా. పలు హోటల్స్ నిర్వాహకులు వెజ్, నాన్ వెజ్ వంటలతో వివిధ రకాలుగా పదార్ధాలు తయారు చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇపుడు పశ్చిమ గోదావరి జిల్లాలో రేషన్ బియ్యం తో ఆహారపదార్ధాలు తయారీ పోటీలు జరిగాయి. రేషన్ బియ్యం అంటే పేదలకు ఉచితంగా అందించేవి. వీటి క్వాలిటీ సరిగా ఉండదని చాలా మంది అమ్మేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఎపి ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెబుతోంది. ఈక్రమంలో వీటితో ఆహార పదార్ధాలు తయారీ ద్వారా వీటి రుచి పై అవగాహన పెంచే ప్రయత్నం పశ్చిమగోదావరి జిల్లా అధికారులు చేశారు.

ఘుమ ఘుమ లాడే వంటకాలు

ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన రేషన్ బియ్యంతో తయారు చేసిన వంటల పోటీలు పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా జరిగాయి. భీమవరం కలెక్టరేట్లో పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ వంటల పోటీలు జరిగాయి. నాణ్యమైన రేషన్ బియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేసారు మహిళలు. మొత్తం 105 రకాల వంటకాలు తయారు చేసారు. గారెలు, బూరెలు, వడలు, అప్పడాలు, పాయసం, చెక్కర పొంగలి, పులిహోర, దద్దోజనం, బెల్లంతాలికలు, ఉండ్రాళ్ళు, జంతికలు, అరిసెలు, దోసెలు అన్ని రకాలను అక్కడే తయారు చేసారు.

దీంతో కలెక్టరేట్ ప్రాంగణం వంటల వాసనతో చూపరులను నోరూరించింది. ఇక పోటీలో పాల్గొన్న మహిళలు తాము తయారు చేసిన పదార్ధాలు ఆకర్షణీయంగా అలంకరించారు. కార్డుదారులు వారికి పంపిణీ చేసిన బియ్యాన్ని తిరిగి అమ్ముకోకుండా ఆ బియ్యంతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమంను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పంపిణీ చేయుచున్న రేషన్ బియ్యంలో పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అనే పౌడరును కలుపుతున్నారు . ఈ బియ్యం వినియోగించడం వల్ల ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వంటలు పోటీలో ఆహారపదార్థాలను పది మంది జిల్లా స్థాయి మహిళా అధికారులతో కూడిన కమిటీ పరీక్షించి విజేతలను ఎంపిక చేశారు. అన్ని వంటలు రుచికరంగా ఉండటంతో అందరినీ విజేతగా ప్రకటిస్తూ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున నగదు బహుమతులు అందించారు. వంటకాలను రుచి చూసి, వంటలు చేసిన మహిళలను అభినందించారు కలెక్టర్ ప్రశాంతి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.