Andhra Pradesh; వాలంటీర్లను భయపెడుతున్న ఫోన్ నెంబర్.. ఇంతకీ ఎంటా నెంబర్.. ఎవరా కేటుగాళ్లు..? – Telugu News | Andhra Pradesh Govt Volunteers Fears about Phone Calls from Cyber Thieves, Know Full Details Here
రాష్ట్రంలో వాలంటీర్ ద్వారా సేకరించబడుతున్న సమాచారం దుర్వినియోగం అవుతుందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. మరీ ముఖ్యంగా ఈ సమాచారంతో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ మాట్లాడటంతో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక వాలంటీర్లు చట్టాన్ని తీసుకుంటున్న ఘటనలు అప్పటినుంచి న్యూస్ లో ప్రధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇక తాజాగా కొయ్యలగూడెం, పరింపూడి2 సచివాలయం పరిధిలో కొట్రా నాగమణి అనే మహిళ ఖాతాలో రూ. 1.70లక్షలు మాయం అయ్యాయి. వీటిని వాలంటీర్ స్వాహా చేశాడని బాధితురాలు పోలీసులకు..
ఏలూరు, ఆగష్టు 10: ఓ ఫోన్ నెంబర్ వాలంటీర్లను భయపెడుతుంది. ఆ నంబర్ నుంచి కాల్ వస్తుందంటేనే వాలంటీర్ల గుండెలు గుబేల్మంటున్నాయి. ఆ ఫోన్ కాల్ ను ఎవరు కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేశారా అంతే సంగతి. అసలు ఆ ఫోన్ కాల్ కు అంతగా భయపడాల్సిన అవసరం ఏమిటి. వారు ఫోన్ చేసి ఏమంటున్నారు. ఎందుకు వాలంటీర్లు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైసిపి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తూ వారి పరిధిలోని ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునీ, తక్షణమే పరిష్కారం చూపే విధంగా వాలంటీర్ వ్యవస్థ పని చేస్తుంది. ఈ క్రమంలో ఇపుడు వాలంటీర్లను ఓ ఫోన్ నెంబర్ వెంటాడుతుంది. ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాలంటీర్లు భయపడుతున్నారు. లిఫ్ట్ చేయాలా లేదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పొలిటికల్ కాంట్రవర్సీలో వాలంటీర్లు..
వాలంటరీ వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల పొలిటికల్ చర్చనీయాంశంగా మారారు. రాష్ట్రంలో వాలంటీర్ ద్వారా సేకరించబడుతున్న సమాచారం దుర్వినియోగం అవుతుందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. మరీ ముఖ్యంగా ఈ సమాచారంతో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ మాట్లాడటంతో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక వాలంటీర్లు చట్టాన్ని తీసుకుంటున్న ఘటనలు అప్పటినుంచి న్యూస్ లో ప్రధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇక తాజాగా కొయ్యలగూడెం, పరింపూడి2 సచివాలయం పరిధిలో కొట్రా నాగమణి అనే మహిళ ఖాతాలో రూ. 1.70లక్షలు మాయం అయ్యాయి. వీటిని వాలంటీర్ స్వాహా చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నోడల్ అధికారిని విచారణకు ఆదేశించారు. నోడల్ అధికారి రమణ, డి.ఎల్.డి.ఓ రాజుతో కలసి విచారణలో భాగంగా బాధిత మహిళ నాగమణి నుంచి వివరాలు సేకరించారు. కొట్ర నాగమణి బ్యాంక్ ఖాతా నుండి నగదు స్వహా చేశారని నిర్ధారించారు. అయినపర్తి వినయ్, వెత్సా పవన్ కుమార్ అనే వాలంటీర్లను జీఓ నంబర్ 4 ను అనుసరించి, విధులు నుండి తొలగించారు. కేసు త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసు వారిని ఆదేశించారు. ఇది వక్రమార్గాలు అనుసరిస్తున్న కొందరు వాలంటీర్ల వ్యవహారం.
రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్లు..
ఓ ఫోన్ నంబర్ నుండి వాలంటీర్లకు ఫోన్ చేస్తున్నారు. మేము సెక్రటేరియట్ నుంచి కాల్ చేస్తున్నామని వాలంటీలను నమ్మిస్తున్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాల వివరాలు, అదేవిధంగా లబ్ధిదారుల వివరాలు వాలంటీర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టమని చెప్తున్నారు. అది నమ్మిన వాలంటీర్లు లబ్ధిదారులతో కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడిస్తున్నారు. అయితే వారు కాల్‌లో ఉండగానే డీటెయిల్స్ అడిగి మీ నెంబర్‌కి ఒక ఓటిపి వస్తుంది అది చెప్పమని అడుగుతున్నారు. అయితే విషయం తెలియని వాలంటీర్లు, లబ్ధిదారులు వారి చెప్పినట్టే చేస్తూ ఓటిపిని వారికి ఇచ్చేస్తున్నారు. వివరాలు తీసుకున్న వారి బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేసి అకౌంట్లో డబ్బులు దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ అలజడి వాలంటీర్లలో గుబులు పుట్టిస్తుంది. ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయవద్దని వారి వారి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ లు షేర్ చేసుకుంటున్నారు. అలాగే వారి లబ్ధిదారులకు సైతం ఎవరైనా ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పవద్దని సూచిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేస్తున్నామని లబ్ధిదారుల వివరాలు తీసుకొని సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వాలంటీర్లు కోరుతున్నారు. మరోవైపు బ్యాంకులు, ఆర్‌బిఐ వంటి సంస్థలు ఓటిపి, పాస్ వర్డ్ ఎవ్వరికీ చెప్పవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త రూపంతో ప్రజల్ని దోచుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..