Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు సినీ ఫక్కీలో భార్య కిడ్నాప్.. అసలు కథ ఇదీ! – Telugu News | Telangana: Woman kidnapped while going to write exam in auto in Bhadradri Kothagudem
ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి..
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10: కొత్తగూడెంలో సినీ పక్కీలో కిడ్నాప్ జరిగింది. భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్ళారు గుర్తు తెలియని దుండగులు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న దంపతులపై జరిగిన దాడిలో భార్తను చితక్కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం (ఆగస్టు 10) చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దీనివెనుకున్న అసలు కుట్ర వెలుగులోకొచ్చింది. అసలేం జరిగిందంటే..
ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి భార్య ను బలవంతంగా కార్లో ఎత్తుకెల్లారు దుండగులు.
కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్ చేశారని తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు భర్త సన్ని.
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. మాధవి కుటుంబ సభ్యులే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని సన్నీ అరోపించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.