Leading News Portal in Telugu

Andhra Pradesh: ప్రాణం పోతున్నా.. భార్యను హత్తుకుని ధైర్యం చెప్పిన కానిస్టేబుల్.. గుండెను పిండేసే దృశ్యాలు.. – Telugu News | ‘Please Save My Life Anna’, Constable Request to Another Police Offers When He Met with an Accident in Anantapru


గాయాలతో ఉన్నా.. పాక్కుంటూ వెళ్లి భార్య అనితను హత్తుకుని.. ఏమీ అవదు, ధైర్యంగా ఉండమని ఆమెను సముదాయించాడు. గుండెలను పిండేసే ఈ ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. గాయపడ్డ కిరణ్ కుమార్, అనిత దంపతులను స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అపిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే కిరణ్‌కుమార్‌ ప్రాణాలు విడిచారు. ఆయన భార్య అనిత సైతం ఆసుపత్రిలో ప్రాణాలతో..

Andhra Pradesh Police Constable

ఓవైపు ప్రాణం పోతున్నా.. మరోవైపు తన భార్య ఎలా ఉందా? అని గాయాలతోనే పాక్కుంటూ వెళ్లి అక్కున చేర్చుకున్నాడు ఆ భర్త.. తనకేమీ కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ భార్యకు ధైర్యం చెప్పాడు.. తీవ్ర గాయాలతో రక్తం కారుతున్నా భార్యను హత్తుకుని ధైర్యం చెబుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి.. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్, తన భార్య అనితను సోమలదొడ్డి క్రాస్‌ వద్ద బస్ స్టాప్ దగ్గర దించేందుకు వెళ్తున్న సమయంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం కింద పడింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ.. కానిస్టేబుల్ కిరణ్ కుమార్, అనిత దంపతుల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెడ్డి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అవ్వడంతోపాటు తీవ్ర గాయాల పాలయ్యాడు. భార్య అనితకు కూడా గాయాలు అయ్యాయి.

రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యి తీవ్ర గాయాల పాలైన కిరణ్ కుమార్ ప్రాణం పోతున్నా తన భార్యకు ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. గాయాలతో ఉన్నా.. పాక్కుంటూ వెళ్లి భార్య అనితను హత్తుకుని.. ఏమీ అవదు, ధైర్యంగా ఉండమని ఆమెను సముదాయించాడు. గుండెలను పిండేసే ఈ ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. గాయపడ్డ కిరణ్ కుమార్, అనిత దంపతులను స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అపిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే కిరణ్‌కుమార్‌ ప్రాణాలు విడిచారు. ఆయన భార్య అనిత సైతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. తాను చనిపోతున్నానని తెలిసి కూడా భార్యకు ధైర్యంగా ఉండమని దగ్గరికి తీసుకొని హత్తుకుని సముదాయించడం ప్రతి ఒక్కరి గుండెను పిండేయగా.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స సమయంలో తమను కాపాడాలంటూ ఉన్నతాధికారులను వేడుకున్న తీరు కంటనీరు తెప్పిస్తుంది.

కిరణ్‌ కుమార్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలుసుకున్న జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ సర్వజనాసుపత్రికి వెళ్లి చూశారు. ఆ సమయంలో కిరణ్ తన బాధను వ్యక్తం చేశారు. ‘అన్నా ఈ ఒక్కసారి నా ప్రాణాలు కాపాడన్నా.. అన్నా మమ్మల్ని బతికించు అన్నా.. పిల్లలున్నారు..’ అంటూ వేడుకున్న తీరు గుండెలను పిండేసింది. కిరణ్ పరిస్థితి తోటీ పోలీసులు కన్నీరు మున్నీరయ్యారు. దేవుడా.. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కిరణ్ భార్యను క్షేమంగా ఉండేలా చూడు స్వామీ అని వేడుకుంటున్నారు అక్కడి వారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె ఏమైనా అయితే ఆ పసివారు అనాథలవుతారని వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..