చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047 | babu vision document 2047| gfst| vizag| august| 15th| indipendence day
posted on Aug 14, 2023 5:40PM
విజనరీ నారాచంద్రబాబునాయుడు విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఈ డాక్యుమెంట్ ని మంగళవారం (ఆగస్టు 15) విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు.
గ్లోబల్ లీడర్ గా భారత్ ఆవిర్భవించేందుకు ఐదు వ్యాహాలు పేరుతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు నాయుడు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం కొన్ని నెలలుగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) బృందం పని చేస్తున్నది. జీఎఫ్ఎస్టీ చైర్మన్ అయిన చంద్రబాబునాయుడు మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో విశాఖలో ఈ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తారు. ఈ డాక్యుమెంట్ 2947 ను మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేస్తారు.
గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటైనది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు.
దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు. విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్టి పని చేస్తుంది.
2047లో దేశం స్వాతంత్ర్యం సాధించి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ నాటికి ఇండియా ప్రపంచ లోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో జీఎఫ్ఎస్టీ నివేదికలు సిద్దం చేస్తుంది.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు… 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు… తనతో కలిసి రావాలని యువతను , మేధావులను చంద్రబాబు పిలుపునిచ్చారు.
తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు.