Leading News Portal in Telugu

AT HOME Program: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌.. సీఎం జగన్‌ హాజరు, చంద్రబాబు దూరం


AT HOME Program: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌.. రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ రోజు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. ఈ రోజు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి హాజరయ్యారు.. రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం దంపతులకు స్వాగతం పలికారు గవర్నర్ అబ్దుల్ నజీర్‌, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు..

ఇక, గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాజ్‌ భవన్‌లో తొలిసారి ఎట్‌ హోమ్‌ జరిగింది.. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలోఉన్న కారణంగా ఎట్‌ హోమ్‌కి దూరంగా ఉండగా.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులులతో పాటు పలువురు హాజరయ్యారు. ఎట్ హోమ్‌కు హాజరైన అతిథులను స్వయంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ పలకరించారు.. ఒక్కో టేబుల్ దగ్గరకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులతో గవర్నర్‌ దంపతులు ముచ్చట్లలో మునిగిపోయారు.

 

Whatsapp Image 2023 08 15 At 7.19.19 Pm(1)

 

Whatsapp Image 2023 08 15 At 7.19.19 Pm

Whatsapp Image 2023 08 15 At 7.19.18 Pm(1)

Whatsapp Image 2023 08 15 At 7.19.18 Pm