
Samantha Ruthprabhu says Go big or go home: చివరిగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రూత్ ప్రభు ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది.
అయితే ఆమె హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆమె మొట్టమొదటిసారిగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. హైదరాబాదులో హైటెక్స్ లో జరుగుతున్న ఖుషి సినిమా లైవ్ కాన్సర్ట్ లో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఒక సాంగ్ పర్ఫార్మ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రోగ్రాం కంటే ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ చాలా సమయం వెచ్చించారు.. అయితే దీనికోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసి పెట్టిన ఒక క్యాప్షన్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదైనా చేస్తే పెద్దగా చేయాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. అదిప్పుడు చర్చనీయాంశం అయింది.