ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. గాయం నుంచి కోలుకుంటాడని దక్షిణ ఆఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను సెలక్షర్లు ఎంపిక చేశారు. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు టాక్.
పాట్ కమిన్స్ స్థానంలో టీ20 టీమ్ సారథి మిచెల్ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు మరింత రెస్ట్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆలోచన చేసిందని తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్‌తో జరిగే వన్డే సిరీస్ సమయానికి సిద్ధంగా ఉండాలని పాట్ కమిన్స్ కు సీఏ సూచించినట్లు తెలుస్తోంది.
కాగా, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా టీమ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ టూర్ కి రానుంది. యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్ సందర్భంగా గాయపడిన కమిన్స్ వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ వరకు రెడీ అయి.. అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.