Tecno Pova 5 Pro 5G Price: టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 15 వేలకే 8GB RAM, 256GB వేరియంట్!
Tecno Pova 5 Pro 5G Smartphone Lauch and Price in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్నో మొబైల్’ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోవా 5, పోవా 5 ప్రో 5జీ ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు గత వారంలోనే లాంచ్ అయినా.. మంగళవారం కంపెనీ ధరలను ప్రకటించింది. Pova 5 ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 కాగా.. ప్రో ధర రూ. 14,999గా ఉంది. టెక్నో పోవా 5 ప్రో డిజైన్.. నథింగ్ ఫోన్ (2)తో సమానమైన ఫీచర్లతో వస్తుంది. పోవా 5, పోవా 5 ప్రో ధరలు, ఫీచర్లను ఓసారి చూద్దాం.
Tecno Pova 5 Pro 5G Price:
టెక్నో పోవా 5 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. ఈ మోడల్ ధర రూ. 11,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ హరికేన్ బ్లూ, మెచా బ్లాక్, అంబర్ గోల్డ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మరోవైపు పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 14,999 కాగా.. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 15,999గా ఉంది. సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్యూజన్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
Tecno Pova 5 Pro 5G Launch Offers:
ఇక లాంచ్ ఆఫర్‌లో భాగంగా టెక్నో మొబైల్ సంస్థ మీకు రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. అదనంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండూ ఆగస్ట్ 22 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ లాంచ్ ఆఫర్‌లు పరిమిత రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Tecno Pova 5 Pro 5G Specs:
పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ 120Hz డిస్‌ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్‌సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. మరోవైపు పోవా 5 ప్రో మోడల్‌లో 6.78-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ కలిగి ఉంది.