Vivek Agnihotri: బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన వివేక్.. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ అంటూ వస్తున్నాడు. ఇక సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ విమర్శలు అందుకుంటూనే ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో ప్రభాస్ ను టార్గెట్ చేసిన విషయం తెల్సిందే. ప్రభాస్ కు పోటీగా.. తన సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ప్రభాస్ కు నాకు పోటీ లేదు అని చెప్పి.. ఇంకోపక్క సలార్ కు పోటీగా వాక్సిన్ వార్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా వివేక్ చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారాయి. గతంలో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Senior Heroine Rashi: ప్రభాస్ పక్కన అలాంటి పాత్ర అయితేనే చేస్తా.. అదే నా ఆశ
ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇక ఆ ఫోటోషూట్ చాలా పెద్ద వివాదానికి దారితీసింది. రణ్ వీర్ సింగ్ పై కేసులు కూడా పెట్టారు. అసలు అవి తన ఫోటోలు కాదని కూడా రణ్వీర్ చెప్పుకొచ్చాడు. ఇక అదే సమయంలో వివేక్.. రణ్ వీర్ కు సపోర్ట్ చేశాడు. రణ్ వీర్ చేసిన పనికి మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. అదే విషయాన్నిపోలీస్ ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నారని, మరి మహిళల నగ్న చిత్రాల వల్ల పురుషుల మనోభావాలు దెబ్బతినవా? అని ప్రశ్నించాడు. వారు ఎక్స్ పోజింగ్ లు చేస్తున్నప్పుడు ఈ వాదనలు రావడంలేదేంటి.. ? అంటూ ప్రశ్నించాడు. ఇక అలా తనకు సపోర్ట్ చేసినందుకు ఒక అవార్డు ఫంక్షన్ లో రణ్ వీర్ నా కళ్ళు పట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.