Leading News Portal in Telugu

Flipkart Smart Watches Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 79 శాతం ఆఫర్.. కేవలం రూ. 1499లకే బోట్ సూపర్ స్మార్ట్‌వాచ్!


Buy boAt Wave Fury Smart Watch Just Rs 1499 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఇటీవలి రోజుల్లో వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లలో భాగంగా కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటిచింది. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 నుంచి 21 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో కూడా చాలా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. దాంతో కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు.

‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ 2023లో భాగంగా స్మార్ట్‌వాచ్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఎంతలా అంటే ఏకంగా 80 శాతం వరకు. ప్రస్తుతం ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ బోట్‌కు చెందిన వేవ్ ఫ్యూరీ (boAt Wave Fury) స్మార్ట్‌వాచ్‌పై 79 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రూ. 6,999కి స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు రూ. 1,499కు అందుబాటులో ఉంది. మరింత తక్కువ ధరకు కొనాలనుకుంటే.. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్‌ 240 x 284ppi, 550-నిట్స్‌తో 1.83-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో డ్యూయల్-లేయర్ మెటల్ కోటింగ్, సిల్క్-ఫినిష్డ్ సర్‌ఫేస్‌తో కూడిన IP67 షెల్, స్కిన్‌కు అనుకూలమైన సిలికాన్ మెటల్ బెల్ట్ ఉంటుంది. IP67 రేటింగ్ కారంగా చెమట, ధూళి నుంచి రక్షణ ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ వినియోగదారులు హృదయ స్పందన రేటు, SpO2 వంటి ఆక్సిజన్ శాచురేషన్, నిద్రను మానిటరింగ్ చేయడంలో సాయపడుతుంది. ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ నుంచి వినియోగదారులు గరిష్టంగా 10 స్టోర్ చేసిన కాంటాక్టులకు కాల్ చేయవచ్చు.