Leading News Portal in Telugu

Prabhas: బెంగుళూరుకి ప్రభాస్… తిరిగి రాగానే ఆ సినిమా షూటింగ్



Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. రెండు పార్టులుగా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసి డిజిటల్ రికార్డ్స్ అన్నింటినీ చెల్లాచెదురు చేసారు సలార్ మేకర్స్. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన టీజర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటే సలార్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎంతగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

లేటెస్ట్ గా సలార్ సాంగ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ప్రభాస్ బెంగుళూరు ట్రిప్ వేస్తున్నాడు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, లిరిసిస్ట్ తో ఫస్ట్ సాంగ్ డిస్కషన్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మీటింగ్ అయిపోయాక సలార్ ఫస్ట్ సాంగ్ గురించి అప్డేట్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ బెంగుళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత… ఈ నెల లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభాస్-మారుతీ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. కనీసం ఒక్క చిన్న క్లూ కూడా ఇవ్వకుండా, ఎలాంటి అప్డేట్స్ ని చెప్పకుండా ప్రభాస్ మారుతీ సినిమా షూటింగ్ చేసేస్తున్నారు. మరి ఎలాంటి సినిమా చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు లాంటి విషయాలు ఎప్పుడు బయటకి వస్తాయో చూడాలి.