Leading News Portal in Telugu

Baby: మరో వారంలో ఓటీటీలోకి కల్ట్ లవ్ స్టోరీ…



Baby

జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్దంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి రికార్డులని కూడా బ్రేక్ చేసి బేబీ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్‌ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో అన్ని సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిసింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్లు గ్రాస్ కి పైగా రాబట్టి ఇప్పటికి ఎక్కడో ఒక చోట బేబీ సినిమాకి మంచి బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాల్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సినిమాగా నిలిచిన బేబీ, కొన్ని రోజులు ఉంటే 100 కోట్ల కలెక్షన్స్ ని కూడా చేరుకునేదేమో. 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబి… మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిపొయింది. అక్కడి నుంచి బేబీ సినిమా బయ్యర్స్ ని సూపర్బ్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో బేబీ సినిమాని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆహా ఓటీటీలో ఆగస్టు 25 నుంచి ఈ కల్ట్ క్లాసిక్ స్ట్రీమ్ అవనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో రిపీట్ షో చూసి ఎంజాయ్ చేయండి, థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు 25న చూసేయండి.