Leading News Portal in Telugu

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి | maoist leader malla rajireddy no more| reward| peddapalli| sastrullapalli crore


posted on Aug 18, 2023 2:02PM

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్నఅనారోగ్యంతో మరణించారు.అయితే ఆయన  మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. 

మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో  కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో  ఆయన మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా వ్యవహరించారు. . ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.