Leading News Portal in Telugu

New Royal Enfield Bullet 350: సెప్టెంబర్లో లాంఛ్ కానున్న కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ 350


New Royal Enfield Bullet 350: ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అమ్ముడు పోతున్న బైకుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ బైక్ అంటే అటు కుర్రకారుకు ఇటు పాత తరం వారికి మోజు ఎక్కువ. ఆ బైక్‌పై వెళుతున్న వారిని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూస్తారు. గతేడాది ఆగస్టులో మార్కెట్లోకి మిడ్ సైజ్ సెగ్మెంట్‌లో హంటర్350 బైక్ ఆవిష్కరించింది రాయల్ ఎన్‌ఫీల్డ్. కేవలం మార్కెట్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే లక్ష బైక్స్ అమ్ముడు పోవడం విశేషం. వచ్చే ఐదు నెలల్లో మరో లక్ష బైక్స్ అమ్ముడు కానున్నాయి. హంటర్-350 బైక్ ధర రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.45 లక్షల (ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోడల్‌కు చాలా ఆదరణ లభించింది. చాలా మంది ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బుల్లెట్ అని కూడా పిలుస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ దాదాపు 90 ఏళ్లనాటిది. దీనిని మొదటిసారిగా నవంబర్ 1932లో లండన్‌లోని ఒలింపియా మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించారు. అప్పటి నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. కొన్నేళ్లుగా సంవత్సరాలుగా అనేక డిజైన్ మార్పులకు గురైంది. ఇప్పుడు మనం త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మరొక అప్ డేటెడ్ వర్షన్ చూడబోతున్నాము. కొత్తమోడల్ బుల్లెట్ 350 సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కంపెనీ J-ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిని రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటోర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350గా పేర్కొంటున్నారు. ఇది మెరుగైన పనితీరును అందించగలదని భావిస్తున్నారు.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 – రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మధ్య ఉంచబడింది. ఇంజన్ విషయానికి వస్తే బుల్లెట్ 350 349cc J-ప్లాట్‌ఫాం ఇంజన్‌తో అందించబడుతుంది. ఇది 20.2hp , 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. బైక్‌కు స్ప్లిట్ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్టాండర్డ్, ఐచ్ఛిక ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, మెరుగైన స్విచ్ గేర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి కొత్త ఫీచర్లు కూడా లభిస్తాయి. కొత్త ఫీచర్లు, మెరుగైన ప్లాట్‌ఫారమ్ కారణంగా 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఖరీదైనదిగా అంచనా వేస్తున్నారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ప్రారంభ ధర రూ. 1.7 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుందని అంచనా.