Canada: భారతీయ సంస్కృతిలో భాగంగా దేవాలయాలు ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న భారతీయులు వారు ఉంటున్న దేశాల్లో దేవాలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు. అలాగే కొన్ని దేశాల్లో ఆయా దేశాల ప్రభుత్వాలే దేవాలను నిర్మింప చేస్తున్న ఘటనలు ఉన్నాయి. విదేశాల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అమెరికాలో దీపావళి పండుగకు జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఇలా కొన్ని దేశాల్లో భారతీయ సంస్కృతులను గౌరవిస్తుంటే కొన్ని దేశాల్లో మాత్రం దేవాలయాలను కూల్చివేస్తున్నారు. అలాంటి ఘటన కెనడాలో జరిగింది. గతంలోనూ ఒక దేవాలయాన్ని ద్వంసం చేయగా.. ఇపుడు మరో హిందుదేవాలయాన్ని ధ్వంసం చేశారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న అతిపెద్ద, పురాతన హిందూ దేవాలయాలాన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన ద్వారంపై ఖలిస్తాన్ రెఫడెండం పోస్టర్లు అతికించారు. ఈ ఏడాదిలోనే కెనాడాలో ఇలా ధ్వంసమైన హిందూ దేవాలయాల్లో ఇది మూడవది.
Read also: Rahul Dravid: బ్యాటింగ్ లైనప్ బాలేదు.. సిరీస్ ఓటమిపై స్పందించిన రాహుల్ ద్రవిడ్!
బ్రిటిష్ కొలంబియాలోని ఓ హిందూ దేవాలయాపై శనివారం అర్ధరాత్రి దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. దాడి అనంతరం ఆలయ ప్రధాన ద్వారంపై ఖలిస్తాన్ రెఫరెండం పోస్టర్లను అతికించారు. జూన్ 18 హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తోందని ఉంది. ఆ పోస్టర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫొటో కూడా కనిపించడం గమనార్హం. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా సాహిబ్ అధిపతిగా ఉంటూ వేర్పాటువాద సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ గా వ్యవహరించారు. జూన్ 18న సాయంత్రం గురుద్వారా ఆవరణలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. ప్రస్తుతం ధ్వంసమైన ఆలయం సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్, బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఏడాది కెనడాలో దేవాలయాల విధ్వంసం జరగడం ఇది మూడోసారి. జనవరి 31న కెనడాలోని బ్రాంప్టన్ లోని ఒక హిందూ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దానిపై భారత్ వ్యతిరేక నినాదాలతో గ్రాఫిటీ వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కెనడాలోని ఒంటారియోలోని మరో హిందూ దేవాలయాన్ని భారత్ వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. ఈ దేవాలయం గోడలపై ఇద్దరు అనుమానితులు పెయింటింగ్ స్ప్రే చేస్తున్న దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన ఫుటేజీలను విండ్సర్ పోలీసులు విడుదల చేశారు. ఇప్పుడు మూడోసారి బ్రిటిష్ కొలంబియాలో ఉన్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
#Breaking Another #Hindu temple vandalised in #Canada by #Khalistan extremists – bogus#Khalistanreferendum posters put at door of @surreymandir to create fear among #Indian community @itssamonline @AryaCanada @DrAmitSarwal @Pallavi_Aus @SarahLGates1 @CBCTerry @AdityaRajKaul pic.twitter.com/PG0NeJJTAE
— The Australia Today (@TheAusToday) August 12, 2023