
Edo Jarigey Lyrical Video Song Released: హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, రవి మహా దాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సహా దర్శకత్వం కూడా వహించడం గమనార్హం. ఈ సినిమాను షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించగా విడుదలైన ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. ఇక తాజాగా ఆర్జీవీ డెన్ లో, ఈ సినిమా ఫస్ట్ లిరికల్ ‘ఏదో జరిగే’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.
Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్
సాంగ్ లాంచ్ అనంతరం డైరెక్టర్ ఆర్జీవీ మాట్లాడుతూ సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిందని, ఈ సినిమా ఇంత ఘన విజయంగా కంప్లీట్ చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్ ‘రాజశేఖర్ సుద్మూన్’కి, బ్యూటిఫుల్ గా పాడి అందరినీ కవ్వించిన కీర్తన శేష్ కి నా ఆల్ ది బెస్ట్ అని అన్నారు. హీరో ‘రవి మహాదాస్యం’ మాట్లాడుతూ సగిలేటి కథ ఒక బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ మూవీ అని, ఈ సినిమాలో ప్రతి సాంగ్ బాగుంటుందని అన్నారు. ఏదో జరిగే పాట హాయిగా వింటూ అయితే నిద్రలోకి జారుకోవచ్చని అన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నాకు గట్టి నమ్మకం ఉందని పేర్కొన్న ఆయన చాలా తక్కువ సమయంలోనే మా మూవీ ట్రైలర్ మిలియన్ వ్యూస్ రీచ్ అయిందన, అదే విధంగా ఈ సాంగ్ రీచ్ అవ్వుతుందని నమ్మకంతో ఉన్నామని అన్నారు.