Russia War: ఉక్రేయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఉక్రేయిన్‌లోని పలు పట్టణాలపై రష్యా దాడులు చేస్తుంది. ఉక్రేయిన్‌పై జరుపుతున్న దాడుల్లో భాగంగా రష్యా ఖేర్సన్ పట్టణంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 23 నెలల పసికందుతోపాటు మొత్తం 7 మంది మరణించారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడుల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖేర్సన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్లోయారు. నైపర్ నది తీరంలో ఉన్న శిరోకా బాల్కా గ్రామంపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, 12ఏళ్ల అబ్బాయి, 23 రోజుల పసికందుతోపాటు మరో స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. దానికి ఆనుకొని ఉన్న మరో గ్రామంలోనూ ఇద్దరు చనిపోయారు. దక్షిణ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలు పైచేయి సాధించాయని ఉక్రెయిన్ సైనిక అధికారులు ప్రకటించారు. జపోరిజియాతో సహా మరికొన్ని ప్రదేశాలను పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఖేర్సన్‌పై రష్యా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Read also: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
ఖేర్సన్‌లో జరిగిన దాడిలో 23 రోజుల పాప మరియు ఆమె 12 ఏళ్ల సోదరుడితో పాటు వారి తల్లిదండ్రులు మరణించారని ఖెర్సన్ రీజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ ప్రోకుడిన్ తెలిపారు. టెలిగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో ఒలెక్సాండర్ ప్రోకుడిన్ ఇలా పేర్కొన్నాడు .. ఈ రోజు ఖేర్సన్ ప్రాంతం భయంకరమైన వార్తలతో కదిలింది. లిటిల్ సోఫియాకు కేవలం 23 రోజులు, ఆమె సోదరుడు ఆర్టెమ్‌కు 12 సంవత్సరాలు, ఈ రోజు, వారు తమ తండ్రితో పాటు తల్లి రష్యా చేత చంపబడ్డారని పోస్టు చేశారు. గత 24 గంటల్లో 36 మంది పిల్లలు మరియు నలుగురు వికలాంగులతో సహా 111 మందిని కుపియాన్స్క్ జిల్లా నుండి ఖాళీ చేయించారని ఖార్కివ్ ప్రాంత మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి ఒలేహ్ సినీహుబోవ్ చెప్పారు. వార్తా నివేదికల ప్రకారం ఖార్కివ్ ప్రాంతంలో ముఖ్యంగా కుపియన్స్క్ సమీపంలో రష్యా షెల్లింగ్, గత వారంలో తీవ్రమైంది, రష్యా దళాలు రెండవసారి నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమ ప్రయత్నాలను బలపరిచాయి. ఉక్రేనియన్ అధికారుల ప్రకారం, 600 కంటే ఎక్కువ మంది పిల్లలతో సహా 12,000 మంది ప్రజలు నగరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రష్యాపై ప్రతిదాడులకు దిగుతోన్న ఉక్రెయిన్.. పాశ్చాత్య దేశాలు అందించిన డ్రోన్లను వినియోగిస్తోంది. మే నెలలో రష్యా అధ్యక్ష భవనంపై దాడికి యత్నించినప్పటి నుంచి డ్రోన్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బెల్గొరాడ్, కుర్క్స్ ప్రాంతాలపై ఒక్కొకటి చొప్పున డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది.