Leading News Portal in Telugu

Sam: ఖుషీ ప్రమోషన్స్ కి ఎండ్ కార్డ్… న్యూయార్క్ వెళ్లిపోయిన సామ్…


మాయోసైటిస్ కారణంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా, సామ్ హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసాయి… అయితే ప్రమోషనల్ కంటెంట్ ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా లైగర్ ఫ్లాప్ అవ్వడం, టక్ జగదీశ్ ఫ్లాప్ అవ్వడంతో హీరో-డైరెక్టర్ ని నమ్మే పరిస్థితిలో ఆడియన్స్ లేరు. ఖుషి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సాలిడ్ ప్రమోషన్స్ జరిగితే కానీ ఓపెనింగ్స్ రావు. ఇలాంటి సమయంలో ఖుషి సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి అంటే సమంత తప్పకుండా ప్రమోషన్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సామ్, ఖుషి ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల పాటు బయట యాక్టివ్ గా కనిపించింది. 

ఖుషి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి సమంత రాలేదు కానీ మ్యూజిక్ కాన్సర్ట్ కి వచ్చి తన ప్రమోషన్స్ ని సామ్ స్టార్ట్ చేసింది. ఈ కాన్సర్ట్ లో సామ్, విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి సాలిడ్ బజ్ ని జనరేట్ చేసింది. ఈ ఈవెంట్ లో సమంత పాల్గొనడంతో ఖుషి వైబ్ మరింత పెరిగింది. ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియా సెలబ్రెటీలని కూడా కలిసిన సమంత ఖుషి సినిమాకి ఎంత చేయాలో అంతా చేసింది. ప్రమోషన్స్ కంప్లీట్ అవ్వడంతో సమంత తన ట్రీట్మెంట్ కోసం అమెరికా బయలుదేరింది. నిన్న నైట్ సమంత హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిపోయింది. అమ్మతో కలిసి న్యూయార్క్ వెళ్లిన సమంత మరో నాలుగైదు నెలల పాటు హైదరాబాద్ కి దూరంగా ఉండొచ్చు.