నిప్పులపై నడవడం అనేది అప్పుడప్పుడు జాతర్లలో కనపడుతూ ఉంటాయి. తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిప్పులపై నడిచి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఈ పద్థతిని ఇప్పుడు క్రికెటర్లు అనుసరిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ నిప్పులపై నడిచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే తాను నడిచింది ఏదో మొక్కుబడి కోసం కాదు. మెదడు చురుగ్గా ఉండటం కోసమని చెబుతున్నాడు.
త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్ టోర్నమెంట్ కు క్రికెటర్లు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించారు. ప్రత్యర్థి జట్లు, ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీస్ గట్టిగా చేస్తున్నారు. ఈ నెల చివర్లో పాకిస్థాన్, శ్రీలంక వేదికగా మొదలయ్యే ఆసియా కప్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. అయితే ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొహమ్మద్ నయీమ్ అనుహ్య పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆసియా కప్ ముందు అతను మైండ్ ట్రైనర్ సహాయం తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఓ మైదానంలో అతను నిప్పులపై నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లా క్రికెటర్ సన్నద్ధత వెరైటీగా ఉందని కొందరు అంటున్నారు. మరికొందరేమో అతను పిచ్చిపనులు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, నిప్పులపై నడవడం ద్వారా మెదడు చురుగ్గా మారి, భయం పోతుందని, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బంగ్లా క్రికెట్ టీమ్ మేనేజర్ ఓ ఆర్టికల్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశాడు.
Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023