Leading News Portal in Telugu

Allu Arjun: పిల్లనిచ్చిన మామ కోసం సాగర్‌లో సందడి చేసిన అల్లు అర్జున్


Allu Arjun Launches Kancharla Convention Center in Nalgonda: నాగార్జున సాగర్ లో శనివారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. తనకు పిల్లనిచ్చిన మామ, అదేనండీ అల్లు స్నేహ తండ్రి, బిఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఒక ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బట్టు గూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్ ను నిర్మించగా దాన్ని శనివారం నాడు అల్లు అర్జున్ ప్రారంభించారు. ఆధునిక వసతులతో 1000 మందికి సరిపడేలా ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారని తెలుస్తోంది. ఇక ఫంక్షన్ హాల్ ను ఓపెనింగ్ కు అల్లు అర్జున్ వస్తునట్లు తెలియడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది.

Anasuya Bharadwaj: ఏంట్రా మీరంతా అంటూ పరువు తీసేసిన అనసూయ

అల్లు అర్జున్ ను చూడటానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారని చెబుతున్నారు. అల్లు అర్జున్ రాకతో ఆయన అభిమానులు ఖుషి అయ్యారు. ఇదిలా ఉంటే బిఅర్ఎస్ నేత అయిన అల్లు అర్జున్ మామా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి బిఅరెస్ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టి జనంలోకి వెళ్తున్న క్రమంలో ఈ సారి తనకు టికెట్ ఇస్తే .. తన అల్లుడు స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా చెబుతున్నారు. ఇక ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఆయన నల్గొండలోని కంచర్ల కన్వెన్షన్ సెంటర్ విషయంలో కంచర్ల శేఖర్ రెడ్డి గారికి అభినందనలు, నల్గొండ అభిమానులు & ప్రజలందరి అభిమానానికి ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు.