Leading News Portal in Telugu

DK Aruna: ప్రభుత్వ భూములు అమ్మీ ఆ సొమ్ముతో ఎన్నికలకు వెళ్తున్నారు..


బీజేపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను ప్రారదొలెందుకు ప్రజలు రెఢీగా ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వాతావరణం క్రియేట్ కోసమే ఎమ్మేల్యేలు పర్యటన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల పాటు తెలంగాణలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు అని డీకే అరుణ వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షల మీద రిపోర్ట్ తయారు చేస్తారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. కేసీఆర్ కి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయి.. ప్రభుత్వ భూములు అమ్మీ.. ఆ సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నాడుని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారు అని పేర్కొనింది.

బీజేపీ 18 రాష్ట్రాల్లో పాలిస్తుంది.. అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని డీకే అరుణ అన్నారు. అన్ని పార్టీల్లో చివరి నిమిషంలో జంపింగులు కామన్.. జనాల్ని దోచుకోవడమే ట్రైలర్ గా బీఆర్ఎస్ పార్టీ చూపించింది అని తెలిపింది. అధికారం కోసం గడ్డి తినేందుకు కూడా కల్వకుంట్ల కుటుంబం వెనుకాడరు.. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మతం పేరుతో గెలవాలని చూస్తున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు విమర్శించారు.

రాష్ట్రంలో అభివృద్ధి చేశామని నమ్మక్కం ఉంటే పోలీసులు లేకుండా ప్రజల్లోక్కి రావాలి అని డీకే అరుణ సవాల్ విసిరారు. మతం పేరుతో చిచ్చు పెడుతుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ బాంబ్ దాడులు, మత కలహాలు జరగలేదు.. మతం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు వీడియోలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. ఈ రెండు పార్టీలు కుర్చీ కోసం ఏదైనా చేస్తారు.. వారి కుట్రలను ప్రజలు గమనించాలి.. తెలంగాణలో అబివృద్ధి కావాలంటే బీజేపీ రావాల్సిన అవసరం ఉంది అని డీకే అరుణ అన్నారు.