Leading News Portal in Telugu

AP Panchayat Bypoll Results: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా..


AP Panchayat Bypoll Results: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. కొన్ని చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులకు పోటాపోటీ ఇవ్వగలిగారు టీడీపీ అభ్యర్థులు. మొత్తం 34 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే ఆధిపత్యం ప్రదర్శించారు. 14 సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొమ్మిది పంచాయతీల్లో టీడీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు గెలిచారు. ఒక స్థానంలో జనసేన మద్దతుదారులు విక్టరీ కొట్టారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి… జిల్లాలో మొత్తం ఒక సర్పంచ్, 11 వార్డులకు ఎన్నికలకు జరగగా పిచ్చాటూరు మండలం అడవి కోడియంబేడు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుడు కిరణ్ కుమార్ నాయుడు నలబై ఓట్లు మెజారిటీతో టిడిపి అభ్యర్థిపై గెలుపోందారు.. ఇక గంగాధరనెల్లూరు మండలం వరత్తూరు, గుడుపల్లి మండలం పెద్దబాదన వాడ, ఐరాల మండలం కాణిపాకం, శాంతిపురం మండలం కడిపల్లి, మఠం, వి.కోట మండలం కొంగాటం ,యాదమరి మండలం కాశిరాళ్ల వార్డు ఎన్నికలలో వైసిపి అభ్యర్ధులు గెలవగా… కుప్పం నియోజకవర్గం పి,బివాడలో టిడిపి అభ్యర్థి 72 ఓట్లతో గెలిచారు..ఇక మంత్రి రోజా సోంత నియోజకవర్గంలో పుత్తూరు రూరల్ మండలం వేపగుంట 3వ వార్డు ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్థిపై 41ఓట్లతో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. లోకల్ బాడీ ఎన్నికలు కావడంతో స్థానిక నేతలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు.. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పంచాయతీ, వార్డు మెంబర్ల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతుదారులు పోటా పోటీగా విజయం సాధించారు. ఇందులో అనంతపురం జిల్లా విషయానికొస్తే 2 సర్పంచులకు స్థానాలకు, 33వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో పెద్దపప్పూరు మండలంలోని దేవునుప్పలపాడు పంచాయతీని వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే 21 వార్డులు కూడా ఏకగ్రీవమ్యయాయి. మిగిలిన 1 ఒక సర్పంచ్ స్థానానికి, 11వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇందులో 6 వార్డుల్లో వ్తెసీపీ, 5 చోట్ల టిడిపి మద్దతుదారుల విజయం సాధించారు. యల్లనూరు మండలం జగ్గంపల్లి సర్పంచ్ స్థానాన్ని టీడీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా విషయానికొస్తే.. ఒక సర్పంచ్ స్థానానికి, 28వార్డు స్థానాలు ఖాలీలు ఏర్పడగా.. 15వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన ఒక సర్పంచ్ స్థానానికి 13వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టిడిపి మద్దతుదారులు 7, వ్తెసీపీ మద్దతు దారులు 6 చోట్ల విజయం సాధించారు. బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్న వైసీపీ మద్దతు దారుడు ఉపేంద్ర రెడ్డి గెలవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద ఎన్నికలు జరిగిన చోట వైసీపీ, టీడీపీ పోటాపోటీగా తలపడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఏకగ్రీవాల విషయంలో వైసీపీ మద్దతుదారులు ఎక్కువగా ప్రభావం చూపారు.

విజయనగరం జిల్లాలో 5 సర్పంచ్, 8 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగింది. ఐదు సర్పంచ్ స్థానాల్లో 3 వైసీపీ, 1 టీడీపీ, 1 వైసీపీ రెబల్ మద్దతుదారులు గెలుపొందారు. 8 వార్డు స్థానాల ఉప ఎన్నికల్లో 6 వైసీపీ, 2 టీడీపీ, మద్దతుదారులు విజయం సాధించారు. వంగర మండలం లక్ష్మీపేట సర్పంచ్ గా టీడీపీ మద్దతుదారు ఆవు సుజాత విజయం సాధించగా, పూసపాటిరేగ మండలం కొప్పెర సర్పంచ్ గా వైసీపీ రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపొందారు. వంగర మండలం ఓనిఅగ్రహారం సర్పంచ్ గా వైసీపీ మద్దతుదారు రుక్మణమ్మ, గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం సర్పంచ్ గా వైసీపీ మద్దతుదారు కరక గౌతమి, విజయనగరం మండలం పడాలపేట సర్పంచ్ గా వైసీపీ మద్దతుదారు సువ్వాడ శ్రీదేవి విజయం సాధించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.

నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామ సర్పంచికి జరిగిన ఉప ఎన్నికలలో వైసిపి తిరుగుబాటు అభ్యర్థి పై టిడిపి అభ్యర్థి మంగళం తిరుమల 88 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వార్డులకు జరిగిన ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థులకు టిడిపి అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్… రెండు వార్డు ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కోవూరు నియోజకవర్గంలో ఒక వార్డును టిడిపి మద్దతుదారు గెలుచుకున్నారు. చేజర్ల మండలం పాతపాడు గ్రామములో వార్డు పదవి జరిగిన ఎన్నికలలో వైసిపి, టిడిపి అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ తీశారు. ఈ లాటరీలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. వెంకటగిరి నియోజకవర్గంలో మూడు వార్డులకు జరిగిన ఎన్నికలలో మూడింటినీ వైసిపి గెలుచుకుంది. సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో జరిగిన మూడు వార్డు ఎన్నికలలో వైసిపి మద్దతు దారులు గెలుపొందారు.

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన 8 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాల్లో 4 చోట్ల వైసిపి, మరో 4 చోట్ల టిడిపి గెలుపొందారు. అనపర్తి నియోజకవర్గంలోని రెండు వార్డు మెంబర్లను వైసిపి కైవసం చేసుకుంది. రాజానగరంలో రెండు వార్డు మెంబర్లకు వైసిపి, టిడిపి చేరొకటి పంచుకున్నాయి. కొవ్వూరులో ఒక వార్డు మెంబర్ ను వైసిపి దక్కించుకుంది. నిడదవోలులో ఒక వార్డు మెంబర్, గోపాలపురంలో రెండు స్తానాలు టిడిపి కైవసం చేసుకున్నాయి. పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంచాయితీ, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 5 పంచాయతీలు వైసీపీ గెలుచుకో గా టిడిపి ఎక్కడ గెలవలేకపోయింది. ఇక వార్డు సభ్యుల విషయంలో టిడిపి 5 చోట్ల గేలవుగా వైసీపీ 6 చోట్ల విజయం సాధించింది. తిరువూరు మండలం ఏర్రవాడ లో వార్డు సభ్యుడు కౌంటింగ్ విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొలత టిడిపి అభ్యర్థి ఒక ఓటుతో గెలిచారని ప్రకటించిన అధికారులు, రీకౌంటింగ్ తర్వాత అదే ఒక ఓటుతో వైసిపి గెలిచిందని చెప్పడంతో అక్కడ ఆందోళన కు దిగారు టిడిపి నేతలు. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఎటువంటి గొడవలు జరగకుండా చూశారు. చివరికి తిరువూరు మండలంలో జరిగిన ఒక వార్డు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

ప్రకాశం జిల్లాలో పంచాయతీల ఉప ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే, సింగరాయకొండ పల్లెపాలెంలో హైడ్రామా నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ దాడి చేశారు వైసీపీ నాయకులు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పంచాయితీ ఎన్నికల పోలింగ్‌లో ఎటువంటి గొడవలూ జరగకుండా ఎమ్మెల్యే స్వామిని, అశోక్‌బాబుకు ముందస్తు హౌజ్‌ అరెస్ట్‌ నోటీసులిచ్చారు పోలీసులు. గ్రామంలో భారీ సంఖ్యలో మోహరించారు. జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎన్నికలు జరిగిన సర్పంచ్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోగా.. 15 వార్డులకు గానూ వైసీపీ 9, టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. సింగరాయకొండ మండలం పాకల సర్పంచ్ ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్ది కుర్రు ప్రసన్నకుమార్ పై టీడీపి అభ్యర్ధి సైకం చంద్రశేఖర్ 249 ఓట్లతో గెలుపొందారు. బేస్తవారిపేట మండలం ఖాజీపురం 3వ వార్డు ఉప ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి వినుకొండ బాలస్వామి 89 ఓట్లతో గెలిచారు. రాచర్ల 6వ వార్డు ఉప ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి షేక్ హాజారాభి 13 ఓట్లతో గెలిచారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా లో ఏడు వార్డులకు, ఒక సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరిగాయి.. తెనాలి 1, చేబ్రోలు 2, పెదనందిపాడు 3, ప్రత్తిపాడు 1 జరగగా.. టిడిపి 4, వైసీపీ 2 స్థానాలు, జనసేన మద్దతు దారులు ఒక స్థానంలో విజయం సాధించారు. బుర్రిపాలెం సర్పంచ్ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంది. పల్నాడు జిల్లా లో మొత్తం 14 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 8 వార్డులో వైసిపి, ఆరు వార్డులలో టిడిపి అభ్యర్థులు గెలుపు సాధించారు… బాపట్ల జిల్లాలో మొత్తం 11 వార్డులకు , రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ….ఆరు వార్డుల్లో వైసిపి, 5 వార్డుల్లో టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు….