Leading News Portal in Telugu

Sreeleela: నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు.. శ్రీలీలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో


Sreeleela: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ముద్దుగుమ్మ శ్రీలీల హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా అమ్మడి పేరే మార్మోగిపోతుంది. దానికి కారణం ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి సరసన స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ప్రజెంట్ ఆమ్మడే అందరి ఫస్ట్ ఛాయిస్… టాలీవుడ్లో టాప్ మోస్ట్ సీనియర్ హీరో దగ్గర నుంచి రీసెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లందరికీ హీరోయిన్ గా శ్రీలీలే కావాలి.. ఆమె పేరే జపిస్తున్నారు. అందానికీ అందం.. నటనకి నటన.. చలాకితనానికి చలాకితనం.. ఇక డ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు.. ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన శ్రీలీలను తమ సినిమాలో పెట్టుకుంటే హిట్ గ్యారెంటీ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే ఓ తెలుగు హీరో శ్రీలీలపై మోజుతో ఏకంగా ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ సినీ వర్గాల భోగట్టా.

అంతేకాదు శ్రీలీల డైరెక్ట్ గా లిప్ లాక్ ఇస్తే ఏకంగా ఐదు కోట్ల పారితోషకం ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారని వార్త ప్రజెంట్ వైరల్ అవుతోంది. అయితే సిని ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్న శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఆ హీరోకు షాక్ ఇచ్చిందట. అంతే కాకుండా ఎవరికి డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వనంటే ఇవ్వనని తేల్చి చెప్పేసిందట. శ్రీలీలో ఆఫర్ రిజెక్ట్ చేయడం మాట అటు ఉంచితే .. ఆ తెలుగు హీరో మాత్రం శ్రీలీల తో ముద్దు కోసం ఇంత పరితపిస్తున్నాడా ..? అంటూ జనాలు షాక్ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క నిమిషం ముద్దు కోసం ఏకంగా ఐదు కోట్లా..? ఏం బాబు శ్రీలీల ముద్దులో అంత కిక్కుందా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మరోమారు మార్మోగిపోతుంది.