Leading News Portal in Telugu

IND vs IRE: భారత్-ఐర్లాండ్ మధ్య రెండో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్


భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ గెలవగా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

CM KCR : సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు..

తొలి టీ20లో భారత్ రెండు పరుగుల తేడాతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గెలుపొందింది. ఇక టీమిండియా బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన చూపించడంతో.. ప్రత్యర్థి జట్టు చేతులెత్తిసింది. ఈ మ్యాచ్ కూడా డబ్లిన్‌లో జరుగుతుంది. రెండు జట్లలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక టీమిండియా తరుఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.

Guntur Kaaram: నో డౌట్స్.. బాబు ల్యాండ్ అయ్యేది సంక్రాంతికే

మరోవైపు భారత్ కు ఇద్దరు ఓపెనర్లు బలంగా ఉన్నారు. తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ల జోడీ మంచి ఆరంభాన్ని అందించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. డకౌట్ చేసి నిరాశ పరిచాడు. అనంతరం సంజూ శాంసన్ బ్యాటింగ్ తో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మ్యాచ్ లో క్రీజులోకి దిగిన భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 2 ఓవర్లలో 18 పరుగులు చేశారు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. భారత్ ఒక మ్యాచ్ గెలిచింది.

Neha Sharma : క్లివేజ్ అందాలతో మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..

భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్

ఐర్లాండ్ జట్టు : ఆండ్రూ బల్‌బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్‌ లిటిల్, బెంజమిన్ వైట్.