సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయమని మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో 475 గ్రామ పంచాయితీకి 10లక్షల, మున్సిపాలిటీ లకు 25కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీ కి 50కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 25కోట్లతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఆర్ & బీ బిల్డింగ్ మంజూరు చేస్తామన్నారు. అయితే.. ఎన్నికలు రాగానే నాయకులు వస్తారని, బీజేపీ, కాంగ్రెస్ కొత్త పార్టీలు కావని, 50ఏళ్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు కట్టాలని ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆలోచన రాలేదు.. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో ఉన్నాయా.. మనకు కులం, మతం, జాతి లేదు.. అందరినీ కలుపుకొని పోతున్నాం… 4వేలు ఇస్తున్నాం అంటున్న కాంగ్రెస్.. వాళ్ళ పాలిస్తున్న రాష్ట్రంలో ఎందుకు ఎవ్వడం లేదు… త్వరలో పెన్షన్ లు పెంచుతాం.. త్వరలో నేనే ప్రకటిస్తా.. 50ఏళ్ల కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎందుకు ఎవ్వలేదు.. కర్ణాటకలో కరెంట్ కోతలు వేధిస్తున్నాయి…. బెంగళూరులో కుడా కరెంట్ కోతలు తప్పడం లేదు.. VRA లు భూసమస్యలకు కారణం అయ్యారు… ధరణి వల్లే రైతు బందు రైతుల అకౌంట్ లలోకి చేరుతుంది.. ధరణి తీసివేస్తే మళ్ళీ అవినీతి మొదలవుతుంది… ఎన్నికలు వస్తే ప్రజలు కంగారుపడొడ్డు… రైతుకు తన భూమి మీద రైతుకే హక్కు ఉండేందుకు మాత్రమే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం… కాంగ్రెస్ వస్తే పైరవిలకే పెద్ద పీట…. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలవాలి.. యాదాద్రి పవర్ ప్లాంట్ తో రాష్ట్ర రూపు రేఖలు మారిపోతాయి.. ఎన్నికల సమయంలో ప్రజలు తొందరపడితే మోసపోతాం… గూసపడతాం… మళ్ళీ అధికారంలోకి వచ్చేది BRS.. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తాం… మరో 5, 6ఏళ్లలో తెలంగాణ రైతు దేశానికే గర్వకారణంగా మారుతం.. బీసీ లక్ష రూపాయల రుణాల మంజూరు నిరంతర ప్రక్రియ..’ అని కేసీఆర్ వెల్లడించారు.