Gold and SIlver Today Price on 20th August 2023 in Hyderabad: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు భారీగా విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 60వేల మార్క్ దాటింది. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి గోల్డ్ రేట్స్ తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. శుక్రవారం, శనివారం తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి.
బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఆదివారం ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 73,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300గా ఉండగా.. చెన్నైలో రూ. 76,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,500ల వద్ద కొనసాగుతోంది.