Leading News Portal in Telugu

Health Tips : మనసు బాగోలేదా..వీటిని తీసుకోండి క్షణాల్లో మూడ్ మారిపోతుంది..


మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్‌లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి..

రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కోడిగుడ్లు తినేవారికి మానసిక ఆందోళన తగ్గిపోతుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు..

అరటి పండు.. అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ పండ్లు. వీటిని మనం రెగ్యులర్‌గా తింటే చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు అరటిపండు తింటే చాలా వరకూ రిలీఫ్‌గా ఉంటుందట. అరటిపండ్లలో ట్రిఫ్టోఫాన్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్‌ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల మనసు రిలాక్స్‌గా ఉంటుంది..

డార్క్ చాక్లెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మెదడు కార్యకలాపాలను ప్రేరేపించడం, నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.. గ్రీన్ టీని అన్ని టీలో కెల్లా బెస్ట్ టీ అని చెప్పొచ్చు. దీనిని తాగడం వల్ల బరువు తగ్గడమే కాదు. కార్టిసాల్ లెవల్స్ తగ్గి ఆందోళన తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా వరకూ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి..

సీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆందోళనని కంట్రోల్ చేస్తుంది. దీనిని తీసుకుంటే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు..

చిక్కుళ్ళల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియంని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది. వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది..

చివరగా చియా సీడ్స్.. ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఇవి చూడ్డానికి చిన్నగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే డిప్రెషన్‌ని తగ్గిస్తుంది.. ఇవి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు…