పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసింది.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యడం దగ్గరి నుంచి ప్రతి లావాదేవీలు జరుపడానికి ఈ పాన్ కార్డు చాలా అవసరం.. ఇది లేకుంటే ఎటువంటి పని జరగదని చెప్పాలి.. పాన్ కార్డ్ ఉంటనే సరిపోదు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం కూడా తప్పనిసరే. ఇలా పాన్ కార్డ్ కీలకమైన డాక్యుమెంట్‌గా మారిపోతుంది.. దాంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి..
ఒకరి పాన్ కార్డ్ ఉపయోగించి మరొకరు లావాదేవీలు చేయడం లేదా లోన్స్ తీసుకోవడం లాంటి మోసాలు బయటపడుతున్నాయి. పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ముఖ్యమైన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు, సంస్థలకు కూడా పాన్ కార్డులు ఉంటాయి…పాన్ నెంబర్లో 10 ఆల్ఫాన్యూమరికల్ డిజిట్స్‌తో ఉంటాయి. ప్రతీ పాన్ నెంబర్ భిన్నంగా ఉంటుంది. అంటే ఒకే నెంబర్‌తో రెండు పాన్ కార్డులు ఉండవు. సైబర్ నేరగాళ్లు ఇతరుల పాన్ కార్డ్ డేటా ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. రుణాలు కూడా తీసుకుంటున్నారు..
ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, మెయిల్స్, ఇతర లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తరచూ చెక్ చేస్తూ ఉండాలి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను నెలకోసారైనా చెక్ చేయాలి. సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీ పేరుతో ఎన్ని లోన్స్, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ రిపోర్ట్‌లో మీరు తీసుకోని లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందేమోనని గుర్తించాలి..మీ పాన్ కార్డుతో జరిపిన లావాదేవీలన్నీ అందులో ఉంటాయి. ఓసారి ఆ వివరాలన్నీ చెక్ చేయాలి. ఒకవేళ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే అలర్ట్ కావాలి. ఉదాహరణకు మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టు ఉంటే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థకు కంప్లైంట్ చేయాలి. సమస్య అనిపిస్తే వెంటనే బ్యాంక్ కు తెలపాలి..మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడవద్దు. ఆదాయపు పన్ను శాఖ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కంప్లైంట్ చేయాలి.. లేదా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయనుకోవాలి..అందుకోసం TIN NSDL పోర్టల్ ఓపెన్ చేయాలి. కస్టమర్ సెక్షన్లోకి వెళ్లాలి. Complaints/ Queries పైన క్లిక్ చేయాలి.. వెంటనే ఫిర్యాదు చెయ్యండి..