ఇటీవలే తిరిగి టీంలోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. కోహ్లీ ఆటతీరును బుమ్రా అనుసరించాలని తెలిపాడు. అంతేకాకుండా.. తన మైండ్‌సెట్‌ను ఓ క్రమపద్ధతిలో సెట్ చేసుకోవాలని చెప్పాడు. దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రాపై చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గతంలో విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌ను కోల్పోయాడని.. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడంటూ చాపెల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చిన తర్వాత బాగా ఆడుతున్నాడని తెలిపాడు. అందుకోసమని.. కోహ్లీనే ఫాలో కావాలని పేర్కొన్నాడు. అయితే మైదానంలోకి దిగక ఏడాది అవుతుంది కావున.. మైండ్ సెట్ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని బుమ్రాకు సలహా ఇచ్చాడు. దాన్ని క్రమపద్ధతిలో సరిచూసుకోవాలి అని చెప్పాడు. అంతేకాకుండా బుమ్రా.. ఒక్కసారి ఒక బంతి మీదనే ఫోకస్ పెట్టాలని చాపెల్ చెప్పాడు. బౌలింగ్ చేసేటప్పుడు మొదటి బాల్ బౌండరీకి వెళ్లినా.. పట్టించుకోవద్దు అక్కడితోనే వదిలేయాలన్నారు. తర్వాత బంతి గురించే ఆలోచించాలని తెలిపాడు. అప్పుడే బౌలింగ్‌పై నియంత్రణ తెచ్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది” అని చాపెల్ సూచించాడు.
గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడం చాలా కష్టమని, ఇందుకు మానసికంగా సిద్ధం కావాలని చాపెల్ అన్నాడు. అప్పుడే నాణ్యమైన ప్రదర్శన ఇవ్వగలరని.. అనవసర ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేస్తే.. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు కలిసి వస్తుందని చెప్పుకొచ్చాడు. తాజాగా జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ పర్యటనతోనే జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే.. మొన్న జరిగిన బౌలింగ్ లో మంచి ప్రదర్శన చూపించాడు. దీంతో మొదటి టీ20లో భారత్ గెలవగా.. ఈరోజు రెండో టీ20 జరుగనుంది.