Leading News Portal in Telugu

Skin Glowing Tips : ఈ జ్యూస్ ను రోజుకు ఒక్కసారి తాగితే చాలు..అందమైన చర్మం మీ సొంతం..


తెల్లగా, అందంగా ఉండాలని ప్రతి మహిళ అనుకుంటారు.. మనం తీసుకొనే ఆహారం ద్వారా కూడా చర్మ రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.. మనలో చాలా మంది చర్మ సంరక్షణ కోసమని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. నిపుణుల ప్రకారం.. దీనికంటే ముందు మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది..

క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గ్లో అవుతుంది. ఈ జ్యూస్ మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను నివారిస్తుంది..

ఉసిరికాయ జ్యూస్ కూడా చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ రసాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.జుట్టును కూడా మంచిదే..

ఆరెంజ్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలుచేస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ చర్మం కాంతివంతంగా, తేమగా కనిపిస్తుంది. ఇది కొన్ని చర్మ సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.. అందుకే వీటిని తాగడం మంచిది..

కీరదోసకాయ జ్యూస్ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ జ్యూస్ ను తాగితే చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాంతివంతంగా కూడా కనిపిస్తుంది… ఈ జ్యూస్ లన్నీ కూడా చర్మ కాంతిని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు..